పాతికేళ్లుగా ఆమె కడుపులో అది ఉంది.. డాక్టర్లు సైతం షాక్‌ నోరెళ్లబెట్టారట

డాక్టర్లను మనం దేవుళ్లుగా పూజిస్తాం.కాని కొందరు డాక్టర్లు మాత్రం రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు.

 Woman Had Medical Clamp Inside Her For 25 Years After Caesarean1 1 1-TeluguStop.com

లక్షల్లో ఒక్కరు ఇద్దరు చేస్తున్న పనుల కారణంగా డాక్టర్లు అంటేనే గౌరవం పోయే పరిస్థితి వచ్చింది.డాక్టర్‌ గారు అంటూ ఎంతో గౌరవంగా మనం పిలుచుకుంటాం.

కాని ఆ డాక్టర్లు చాలా అశ్రద్దతో చేస్తున్న పనుల కారణంగా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.ఆపరేషన్‌ సమయంలో డాక్టర్లు కడుపులో ఏదో ఒకటి పెట్టి మర్చి పోయారు అంటూ మనం ఈమద్య కాలంలో వార్తల్లో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం.

డాక్టర్లు చేస్తున్న పనుల కారణంగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది.

పాతికేళ్లుగా ఆమె కడుపులో అది �

తాజాగా రష్యాకు చెందిన ఒక మహిళ కడుపు నొప్పితో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యింది.ఆమెకు ఎక్స్‌రే తీయగా ఆమె కడుపులో ఆపరేషన్‌ చేసే సమయంలో వినియోగించే కత్తెర ఉంది.డాక్టర్లు ఆమెకు 25 ఏళ్ల క్రితం డెలవరీ సమయంలో సిజేరియన్‌ అయ్యింది.

అప్పుడే కడుపులో కత్తెర పెట్టి ఉంటారని డ్టార్లు గుర్తించారు.అప్పటి నుండి ఆమెకు అప్పుడప్పుడు కడుపులో నొప్పిగా ఉన్నా ఆమె ఏదో ఒక మందులు వాడుతూ దాన్ని తగ్గించుకునేది.

అయితే తాజాగా నొప్పి ఎక్కువ అవ్వడంతో ఇక చేసేది లేక హాస్పిటల్‌కు వెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది.

కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెకు ఎక్స్‌రే తీసిన డాక్టర్లు అవాక్కయ్యారు.

ఆరు ఇంచుల కత్తెరను పాతికేళ్లుగా ఎలా కడుపులో ఉంచుకుంటుంది అంటూ వారు అవాక్కయ్యారు.తాజాగా ఆపరేషన్‌ చేసి ఆమె కడుపులోంచి డాక్టర్లు కత్తెరను తీయడం జరిగింది.

అప్పట్లో ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ ప్రస్తుతం బతికే లేడట.దాంతో కేసు పెట్టడానికి కూడా ఎవరు లేరు.

పాతిక సంవత్సరాలుగా కడుపులో కత్తెర ఉన్నా కూడా ఆమె బాగానే ఉండటం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తుంది.అందుకే భూమిమీద నూకలు ఉంటే ఏం చేసినా ప్రాణం పోదు అంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube