వారిని వెళ్ళగోడతాం..ట్రంప్ హెచ్చరికలు..

అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది అక్రమ వలసదారులని ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్ళగొట్టి తీరుతామని ట్రంప్ హెచ్చరికలు చేశారు.వచ్చే వారం ఈ ప్రక్రియ తప్పకుండా ప్రారంభం అవుతుందని, వలస దారులని వెనక్కి తీసుకునేందుకు గ్వాటిమల అంగీకారం తెలిపిందని ట్రంప్ ఉద్గాటించారు.

 Donald Trump Monitorial To Prohibited Migrants-TeluguStop.com

వచ్చే వారంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ప్రక్రియని ప్రారంభించనుందని ట్రంప్ అన్నారు.

వారిని వెళ్ళగోడతాంట్రంప్ హె�

మధ్య అమెరికా దేశాల్లో అశాంతి కారణంగా అక్కడి ప్రజలు గ్వాటిమలా కి చేరుకొని అక్కడి నుంచీ మెక్సికో కి వచ్చి అక్కడి నుంచీ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని ట్రంప్ పేర్కొన్నారు.వారు ఎంత త్వరగా అయితే అమెరికాలోకి వచ్చారో అంతకంటే త్వరగా అమెరికా నుంచీ పంపివేయబడుతారని ట్రంప్ ట్వీట్ చేశారు.అయితే మెక్సికోకి అమెరికా సాయం అపేస్తామనే కారణం చూపి భయపెట్టి మరీ ఈ ఒప్పందానికి ఒప్పించింది అమెరికా.

దాంతో ఈ ఒప్పందం ప్రకారం మెక్సికో అమెరికా సరిహద్దులో సుమారు 6 వేల మంది గార్డులని నియమించి వలసదారులు అమెరికాలో అక్రమంగా ప్రవేసించకుండా అడ్డుకుంటోంది.అంతేకాదు తమ దేశం నుంచీ అమెరికాలోకి ప్రవేశించిన వారిని కూడా వెనక్కి తీసుకోవడానికి అంగీకారం తెలిపింది.

ఈ క్రమంలో దాదాపు అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల్లో 10 లక్షల మందిని వెనక్కి పంపడానికి ట్రంప్ కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube