అదే జరిగితే పెట్రోల్‌ బంక్‌లలో పిల్లలు ఆటలాడుకోవాల్సిందే... ఆందోళనలో బంక్స్‌ యాజమాన్యం

ప్రపంచం మొత్తం కూడా విప్లవాత్మకంగా మారుతూనే ఉంది.ఎన్నో అద్బుతాలు ఆవిష్కారం అవుతూ ఉన్నాయి.

 Petrol And Diesel Could Be Sold In Supermarkets Very Soon In India1 1-TeluguStop.com

మారుతున్న పరిస్థితులు, పరిసరాలకు తగ్గట్లుగా మారక పోతే అప్పుడు తప్పు మనది అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మాకు ఇదే పద్దతి బాగుంది, ఇందులోనే కొనసాగుతాం అంటే కొత్త ఆవిష్కరణలు వద్దంటే ప్రపంచంతో ముందుకు వెళ్లలేం.

కొత్త ఆవిష్కరణలు వచ్చిన సమయంలో కొంత విమర్శలు వచ్చినా, కొందరు ఇబ్బంది పడ్డా ఎక్కువ శాతం మంది లాభపడతారు.అందుకే కొత్తను ఎప్పుడు కూడా ఆహ్వానించాలి.

ఇండియాలో త్వరలో పెట్రోలియం ఉత్పత్తుల్లో కొత్త పద్దతి రాబోతుంది.

ఇప్పటి వరకు పెట్రోల్‌ లేదా డీజిల్‌ కావాలి అంటే బంక్‌ లలోకి వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది.

కాని ఇప్పుడు అలా అక్కర్లేదు.బంక్‌లోకి వెళ్లి పెట్రోల్‌ కొనకుండానే కిరాణా షాప్‌కు వెళ్లి కూడా పెట్రోల్‌ను కొనుగోలు చేయవచ్చు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కొత్త ఆలోచన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.తప్పకుండా ఈ రిటైల్‌ పెట్రోల్‌ ఉత్పత్తులు తప్పకుండా అందరికి ఆమోద యోగ్యంగా ఉంటాయని అంటున్నారు.

పెట్రోల్‌ను ప్యాకెట్స్‌ లేదా డబ్బాల్లో ప్యాక్‌ చేసి సూపర్‌ మార్కెట్‌లో అమ్మే యోచన చేస్తున్నట్లుగా కేంద్ర పెట్రోలియం శాఖ తెలియజేసింది.అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

అదే జరిగితే పెట్రోల్‌ బంక్‌ల

పెట్రోల్‌ మరియు డీజిల్‌లను మార్కెట్‌లో అమ్మితే బంక్‌ల పరిస్థితి ఏంటీ మరీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.బంక్‌లలో పెట్రోలు కొనుగోలు చేసేందుకు జనాలు రాకుంటే అప్పుడు ఆ బంక్‌ల్లో పిల్లలు క్రికెట్‌ ఆడుకోవాల్సిందే అని, వాటిని మూసేసే పరిస్థితి వస్తుందని, అలా చేస్తే లక్షలాది మంది రోడ్డున పడతారంటూ బంక్‌ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే బంక్‌లలో ఉండే వారికి ఏదైనా ప్రత్యామ్నాయం చూసే యోచనలో కూడా కేంద్రం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి 2025 వరకు ఏదో భారీ మార్పు జరగడం తద్యంగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube