తొలిసారి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న జగన్...ప్రత్యేక హోదా సంగతేంటో

ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగున్న నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొననున్నారు.ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది.

 Cm Jagan Going To Attending The Niti Ayog Meeting In Delhi-TeluguStop.com

ఈ సమావేశానికి ఏపీ సీ ఎం జగన్ తో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర రక్షణ,ఆర్ధిక,హోమ్,వ్యవసాయ,గ్రామీణాభివృద్ధి,పంచాయతీ రాజ్ శాఖా మంత్రులు కూడా హాజరు కానున్నారు.అయితే ఈ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా పై మోడీ తో చర్చించనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఏపీ కి కావాల్సిన అన్ని సహకారాలు కేంద్రం అందిస్తుంది కానీ ప్రత్యేక హోదా విషయం లో మాత్రం కొంచం కష్టమే అని పలుసార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే.

అయితే సి ఎం జగన్ మాత్రం వీలైనన్ని సార్లు కేంద్రాన్ని ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తామని, వారు అర్ధం చేసుకొనేవరకు అడుగుతూనే ఉంటాం అని గతంలో వ్యాఖ్యానించారు.

అయితే ఈ రోజు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశం లోనే ప్రత్యేక హోదా పై చర్చిస్తారని అందరూ భావిస్తున్నారు.ఈ సమావేశంలో పాల్గొనడం కోసం సీ ఎం జగన్ అప్పుడే ఢిల్లీ కూడా వెళ్లిపోయారు.

అలానే తెలంగాణా సి ఎం కేసీఆర్ కూడా ప్రస్తుతం ఢిల్లీ టూర్ లోనే ఉండడం తో ఆయన కూడా ఈ సమావేశానికి హాజరు అవుతారు అని అనుకుంటున్నారు.అయితే దీనిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube