ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు చూపంతా కూడా ఇప్పుడు ఆయన పైనేనట.ఇంతకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా.
ఆయనే ఒకప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ కు అధికారాన్ని అందించి,ఇప్పుడు ఏపీ లో వైసీపీ పార్టీ కి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్.ఒకప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ కు అధికారాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ నే వైసీపీ పార్టీ తమ ఎన్నికల వ్యూహ కర్తగా నియమించుకుంది.
దీనితో సస్సెస్ ఫుల్ గా ఏపీ లో అనూహ్యంగా 151 సీట్ల తో అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తో ఆ పార్టీ నేతలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
దీనితో వారిలో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.గుంటూరులో జరిగిన టీడీపీ వర్క్ షాప్ సమీక్షా సమావేశం సందర్భంగా పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోవాలని టీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు… మళ్లీ పార్టీని గెలిపించుకోవడం ఎలా అనే దానిపై అప్పుడే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవరత్నాల పధకాలు అనేవి వైసీపీ విజయానికి ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే.
అయితే ఈ నవరత్న పధకాల రూపకల్పన చేసిందే ప్రశాంత్ కిషోర్ టీమ్.అంతేకాకుండా ఆ పార్టీ విజయాన్ని అందుకోవడానికి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి చివరికి వైసీపీ కి అధికారం దక్కలా ప్రశాంత్ టీమ్ ఎంతో కీలక పాత్ర పోషించింది.
ఈ క్రమంలో బాబు ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ఆ టీమ్ తో ఒప్పందం కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.ఇటీవల జరిగిన ఎన్నికల తో వైసీపీ కి ప్రశాంత్ టీమ్ తో కుదిరిన ఒప్పందం ముగిసిపోయిందని సమాచారం.
దీనితో ఇప్పుడు టీడీపీ అధినేత చూపు ఆయనపై పడినట్లు తెలుస్తుంది.








