కాస్టింగ్ కౌచ్ ఉదంతంలో నానాపటేకర్ క్లీన్ చీట్

ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆ మధ్య కాలంలో బాలీవుడ్ లో మీటు క్యాంపైన్ ని తెర మీదకు తీసుకువచ్చి బాలీవుడ్ లో లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు బహిర్గతం చేసింది.ఈ ఉదంతంలో తనుశ్రీ దత్త బాలీవుడ్ స్టార్ నటుడు నానాపటేకర్ మీద లైంగిక ఆరోపణలు చేసింది.

 Nana Pate4kar Have A Clean Chit In Casting Couch Allegation-TeluguStop.com

ఓ సినిమా షూటింగ్ సమయంలో అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ ఉదంతానికి ఆజ్యం పోసింది.ఆమెను ఆదర్శంగా తీసుకుని చాలామంది కథానాయకులు నటీమణులు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి, తమను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రముఖుల గురించి బయట పెట్టారు.

దీంతో ఒక్కసారిగా కాస్టింగ్ కౌచ్ ఉదంతం బాలీవుడ్ సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే తనుశ్రీ దత్త నానాపటేకర్ మీద చేసిన లైంగిక వేధింపులు ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసినట్లు సమాచారం.

అతనికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని తాజాగా బాలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది.అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నానా పటేకర్ పిఆర్ టీమ్ అలా పబ్లిసిటీ చేసుకుంటుందని తనుశ్రీ దత్త న్యాయవాది ఆరోపించారు.

అయితే నానాపటేకర్ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం అనేది నిజమని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube