ఏటీఎం వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఆర్బీఐ సంచలన నిర్ణయానికి రెడీ

కేంద్రంలో మోడీ మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి సంచల నిర్ణయాలు ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పూర్తి మెజార్టీతో ప్రధాని అయిన నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

 Bad News For Indian Atm Card Users-TeluguStop.com

అందుకు ఆయన మిత్రపక్షాలను ఒప్పించడం, ఇతరులను మెప్పించడం వంటివి అవసరం లేదు.గతంలో నోట్ల రద్దు అంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న మోడీ ఈసారి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోడు అని అనుకోలేం.

గత కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న వార్త ఒకటి ఏటీఎం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.

ఏటీఎం వినియోగదారులకు బ్యాడ్‌

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏటీఎంను వినియోగిస్తున్నారు.వంద రెండు వందల నుండి లక్షల వరకు కావాలన్నా ఏటీఎంను ఆశ్రయిస్తున్నారు.ఇప్పటికే ఏటీఎంను పరిమితికి మించి వినియోగిస్తే ఛార్జ్‌లు వేస్తున్న బ్యాంకు వారు కొత్తగా మరో పన్ను తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆర్బీఐ పరిశీలనలో ఉన్న ఈ పను అమలులోకి వస్తే కింది స్థాయి వారికి, మద్య తరగతి వారికి ఎలాంటి సమస్య అయితే లేదు.కాని ఎగువ మద్య తరగతి వారికి మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు.

ఇంతకు ఆ నిర్ణయం ఏంటీ అంటే ఏటీఎం నగదు డ్రా లిమిట్‌.

ఇప్పటి వరకు ఒక వ్యక్తి సంవత్సరంలో ఎంత డ్రా చేసినా కూడా అనేవారు, అడిగేవారు లేరు.

కాని ఇకపై దానికి లిమిట్‌ ఉండబోతుంది.సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేస్తే ఐటీ చూపించడంతో పాటు, అయిదు శాతం పన్ను విధించేలా చర్చలు జరుపుతున్నాయి.

ఇది ఎగువ మద్య తరగతి వారికి మరియు ఉన్నత శ్రేణి వారికి మాత్రమే కాస్త ఇబ్బంది కలిగించే విషయం.కనుక వారు ఎక్కువగా ఉండరు, విమర్శలు ఎక్కువగా రావు అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

ఏటీఎం వినియోగదారులకు బ్యాడ్‌

కేంద్ర ప్రభుత్వం 10 లక్షల లిమిట్‌ను మెల్ల మెల్లగా తగ్గిస్తూ అయిదు లక్షల వరకు తీసుకు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.మద్య తరగతి వారి సగటున నెలకు 50 వేల రూపాయలు నగదు డ్రా చేసినా సంవత్సరంలో ఆరు లక్షలు అవుతున్నాయి.అంటే అప్పుడు వారిపై బాదుడు ఉండే అవకాశం ఉంది.పరిమితి మరింత తగ్గిస్తే ఎక్కువ శాతం జనాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది.ప్రస్తుతానికి అయితే 10 లక్షల పరిమితితో ఈ విధానం అమలులోకి తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆర్బీఐ తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై జనాల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube