చంద్రబాబుకి టెన్షన్ పెంచుతున్న జగన్ పరిపాలన! పార్టీ భవిష్యత్తుపై సుదీర్ఘ ఆలోచన

తాజా ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకున్న తర్వాత పరిపాలనలో మొదటి రోజు నుంచి తనంధైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక క్యాబినెట్ ఏర్పాటుకి మున్నదే కీలకమైన నిర్ణయాలు తీసుకొని గాడి తప్పిన పరిపాలనని దారిలో పెట్టి తన మార్క్ చూపించే ప్రయత్నం చేసినన్ జగన్ తాజాగా క్యాబినెట్ విస్తరణలో మరోసారి రాజకీయాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 Chandrababu Tension About Ap Cm Ys Jagan Fallowing-TeluguStop.com

ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక సమీకరణాలు ప్రకారం అన్ని కులాలకి చెందిన వారికి తన క్యాబినెట్ లో జగన్ అవకాశం కల్పించి తన పరిపాలన విధానం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్నడూ లేని విధంగా ఇంతకాలం అనుభవం లేదు అనే మాటల నుంచి జగన్ పరిపాలన విధానంలో తన తండ్రి వైఎస్ ని మరిపిస్తున్నాడు అనే విధంగా అతి తక్కువ టైంలోనే తన మార్క్ చూపించగలిగాడు.

ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కి పెరిగిపోతున్న ఇమేజ్ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుని టెన్షన్ పెడుతుంది అనే మాట వినిపిస్తుంది.ఇప్పటికే పార్టీ సమీక్షలలో నేతలలో అంతర్మధనం మొదలైంది అని తెలుస్తుంది.

ఎలాంటి నాయకత్వ లక్షణాలు లేని లోకేష్ ని బాబు పెద్ద పీట వేయడం వలెనే పార్టీకి ఎంత ఘోరమైన ఓటమి వచ్చిందని అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.దీంతో సామర్ధ్యం లేని కొడుకు లోకేష్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కచ్చితంగా తెలుగు దేశం పార్టీ రానున్న రోజులల్లో కనుమరుగు కావడం గ్యారెంటీ అనే అభిప్రాయానికి వచ్చిన బాబు ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube