జగన్ వ్యవహారశైలిపై అధికారుల్లో ఇదే చర్చ !

ఏపీ సీఎంగా వారం రోజులు పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ ఆయా శాఖల అధికారులతో నిత్యం సమీక్షలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

 Ys Jagan Huge Respected The Ap Employes-TeluguStop.com

ఏయే శాఖల్లో పనులు ఎంతవరకు వచ్చాయి, వాటిలో చెయ్యాల్సిన మార్పులూ, తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు అనేక సూచనలు చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో.

అధికారులతో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ వర్గాలు కూడా పూర్తిస్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులతో మీటింగ్ సందర్భంగా జగన్ వారిని ఉద్దేశించి అన్నా అంటూ సంబోధిస్తూ వారికి తగిన గౌరవం కల్పిస్తుండడంతో ఆ అధికారులు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నారు.

జగన్ ఇలా మాట్లాడ్డం తమకు కొత్త అనుభూతిగా ఉందని ఓ ఉన్నతాధికారి ఆనందంగా తన సహచర అధికారులకు చెప్పుకుంటున్నాడు.ఒక సమీక్షలో డి.సాంబశివరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయబోతుండగా అన్నా ఒక్క నిమిషం అంటూ జగన్ అన్నారు.గతంలో ఏ ముఖ్యమంత్రి తమను ఇలా పిలిచింది లేదంటూ అధికారులు అంటున్నారు.

ఇక ముఖ్యమంత్రికి ఏదైనా విషయం గురించి వివరిస్తున్నప్పుడు ఉన్నతాధికారులు నిలబడే మాట్లాతారు.సరిగ్గా అలానే సీఎం జగన్ ముందు కొందరు అధికారులు నిలబడి మాట్లాడబోతే అలా వద్దు కుర్చీ మాట్లాడండి అంటూ జగన్ చెబుతున్నారట.

-Telugu Political News

కొన్ని సందర్భాల్లో మీటింగ్ మధ్యలో ఉన్నా.మీరు భోంచేసి రండి నేను వెయిట్ చేస్తా అని అధికారులకు సీఎం చెబుతున్నారు.ప్రభుత్వోద్యోగులంతా ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకూ మాత్రమే సెక్రటేరియట్ తో సహా అన్ని ఆఫీసుల్లో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి జగన్ సూచించారు.సెలవు రోజుల్లో రివ్యూలు పెట్టొద్దని కూడా జగన్ ఆదేశాలు జారీ చేశారట.

నీటిపారుదల శాఖ రివ్యూలో జగన్ మాట్లాడుతూ.టెండరింగ్ విధానంలో ఎక్కడా చేతివాటానికి ఆస్కారం లేకుండా చూడాలని కఠినంగా చెబుతున్నారట.

నేను ఏ ఒక్క కాంట్రాక్టర్ నుంచీ ఒక్క పైసా ఆశించడం లేదు, ఒకవేళ నేను ఏదో ఆశిస్తున్నట్టు మీద దృష్టికి వస్తే వెంటనే నేరుగా మీడియాకి చెప్పేయండి అంటూ జగన్ చెబుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube