మరో 30 ఏళ్లలో మానవాళి వినాశనం తప్పదా

ప్రకృతిని, పర్యావరణాన్ని సమూలంగా నాశనం చేస్తూ సాంకేతికత మాటున పరుగులు పెడుతున్న మానవ సమూహానికి అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందనే మాట ఇప్పుడు పర్యావరణవేత్తల నుంచి వినిపిస్తుంది.అడవులను సమూలంగా నాశనం చేస్తూ మొత్తం ప్రపంచాన్ని కాంక్రీట్ జంగిల్స్ గా మార్చేస్తున్న మనిషి మీద ప్రకృతి ప్రతీకారం కోసం ఎదురు చూస్తోందని గత కొంతకాలంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు చూస్తూ ఉంటే తెలుస్తోంది.

 Climate Change Could Pose Existential Threat By 2050-TeluguStop.com

ప్రతి ఏడాది పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా భూతలం విపరీతంగా వేడెక్కుతుంది.అదే సమయంలో మంచు కొండలు కూడా నెమ్మదిగా కరుగుతున్నాయి.

ఈ ప్రభావం రానున్న 30 ఏళ్లలో ప్రపంచం మీద అత్యంత ఘోరమైన విపత్తుగా మారబోతుంది అని ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రిస్టోరేషన్ సంస్థ తెలియజేసింది.ఈ సందర్భంగా ప్రపంచంలో పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ప్యానెల్ ఏమి చేయట్లేదు అన్న ఆగ్రహాన్ని ఆ సంస్థ చేసింది.

ఈ వాతావరణ మార్పుల కారణంగా భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగి భవిష్యత్తులో 90 శాతం మంది మనుషులు అంతరించిపోయే ప్రమాదం ఉందని నివేదికలో పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా రానున్న 30 ఏళ్లలో మూడు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఈ కారణంగా సముద్ర తీరాన ఉన్న ఫ్లోరిడా, షాంగై, లాగోస్, ముంబై లాంటి మహా నగరాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అలాగే ఉష్ణోగ్రత ప్రభావం కారణంగా 90 శాతం మంది జనాభా అంతరించిపోతుందని తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube