విశాఖ నుంచే పవన్ భవిష్యత్ రాజకీయాలు మొదలు పెడుతున్నాడా

ఏపీ రాజకీయాలలో సరికొత్త మార్పుని తీసుకొస్తా అంటూ, డబ్బులు లేని రాజకీయాన్ని నడిపిస్తా అని, మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తాజా ఎన్నికలలో ప్రజలు భారీ ఓటమి అందించారు.కేవలం ఒక్క స్థానంకి జనసేన పార్టీని పరిమితం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ నిలబడిన రెండు స్థానాలలో కూడా ఓడించారు.

 Janasena Chief Pawan Kalyan Plan To Build Party From Visakhapatnam-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో తనకి ప్రజల నుంచి పరాభవం ఎదురవుతుందని అస్సలు ఊహించి ఉండడు.అయితే ప్రజల ఇచ్చిన తీర్పు ఎలా ఉన్న స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓడిపోయినా తర్వాత కూడా చాలా హుందాగా స్పందించి జనసేన పార్టీకి ఓట్లు వేసిన అందరికి కృతజ్ఞతలు చెప్పాడు.

వాళ్ళంతా మార్పుని కోరుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే తాను 25 ఏళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇక సినిమాలని పూర్తిగా పక్కన పెట్టేసే రాజకీయాలపైనే ద్రుష్టి పెట్టబోతున్నట్లు చెప్పేసాడు.

అయితే పవన్ కళ్యాణ్ ఇక భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి.తాను కోరుకున్న మార్పుకి శ్రీకారం చుట్టడంతో పాటు, జనసేన పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవడానికి ఎక్కడ పునాదులు వేస్తాడు అనే ప్రశ్న రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

అయితే దానికి పవన్ కళ్యాణ్ విశాఖని అడ్డాగా ఎంచుకున్నాడని టాక్ వినిపిస్తుంది.విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఏపీ రాజకీయాలలో తన ప్రస్తానంకి బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అయినట్లు టాక్ వినిపిస్తుంది.

దీనికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాడని, వివి లక్ష్మినారాయణతో కలిసి పార్టీ నిర్మాణం, భవిష్యత్తు మీద సుదీర్ఘం ప్రణాళిక సిద్ధం చేసుకొని పవన్ రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నాడు అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube