ప్రధానితో పాటు ఏకంగా 54 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం! ఏపీకి నో ప్లేస్

భారత ప్రధానిగా బీజేపీ పార్టీ నుంచి రెండో సారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసారు.ఇక ఇప్పటికే దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన మోడీకి దేశ ప్రజలు మరిసారి పట్టం కట్టి రారాజుగా ఉండాలని భారీ మెజారిటీతో గెలిపించారు.

 Modi Confirm To 54 Ministers In His Cabinet-TeluguStop.com

దీంతో గతంలో మాదిరిగానే ఈ సారి కూడా మిత్ర పక్షాల సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం మోడీ సొంతం చేసుకున్నాడు.ఇదంతా కేవలం మోడీ మేనియాతోనే సాధ్యం అయ్యింది.

తాజాగా రాష్ట్ర పతి భవన్ లో మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం అతిరధమహారధుల మద్య జరిగింది.ఇదిలా ఉంటే ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో ప్రధాని మోడీతో పాటు ఏకంగా 54 మంత్రి మంత్రులుగా ప్రమాణం చేయడం విశేషం.

ఇదిలా ఉంటే తాజాగా మోడీ క్యాబినెట్ లో బీజేపీ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభించిన అన్ని రాష్ట్రాలకి ఇంచుమించు మంత్రి పదవులు ఇచ్చారు.ఇక బీజేపీ ప్రభావం లేని ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు.

ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసారు.గతంలో దత్తాత్రేయకి మోడీ క్యాబినెట్ లో మంత్రి పదవి రాగా ఇప్పుడు కిషన్ రెడ్డికి వచ్చింది.

ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ పార్టీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపించిన, ప్రస్తుతం ఉన్న మిత్ర పక్షాలకి తప్ప కొత్తగా వచ్చిన వారికి మోడీ అవకాశం ఇవ్వలేదు.అయితే ఈ సారి కూడా ఏపీకి చెందిన నిర్మలా సీతారామన్ ఎమ్మెల్సీ కోటాలో మరోసారి మంత్రి పదవి దక్కించుకోవడం మాత్రమే కాస్తా ఊరట కలిగించే అంశం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube