రిలీజ్ కి ముందు వివాదంలోకి సీత! పేరు మార్చకపోతే ఇక అంతే

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీత.ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి అంచనాలు అందుకుంది.

 Bharatiya Yuva Morcha Fire On Seetha Movie Title-TeluguStop.com

ఇందులో కాజల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో మోడరన్ సీతగా కనిపిస్తుంది.ఇక ఆమెని వెన్నంటే కాపాడే హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అయ్యింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా చుట్టూ వివాదం రాజుకుంది.

ఇక ఈ వివాదానికి కారణంగా సినిమాకి సీత టైటిల్ పెట్టడం, దానికి తోడు సీత పాత్రని నెగిటివ్ షేడ్స్ లో ప్రాజెక్ట్ చేయడమే అని తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమాపై భారతీయ యువ మోర్చా వివాదం రాజేసింది.సీత టైటిల్ పాత్ర హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణం సినిమా టైటిల్ మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

టైటిల్ మార్చకుండా సినిమా రిలీజ్ చేస్తే దియేటర్స్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.అయితే రిలీజ్ కి ముందు ఇలా సినిమాపై ఉన్నపళంగా వివాదం రాజేయడం వెనుక ప్రమోషన్ స్ట్రాటజీ ఉంది అనే టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube