మనదే రాజ్యం ! హస్తినలో 'బాబు బాగా బిజీ'

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.ఢిల్లీ వేదికగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులను కలుస్తూ హడావుడి చేస్తున్నాడు.

 Chandrababu Naidu Busy Schedule In Delhi Tour-TeluguStop.com

రాబోయే ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీ లే అత్యధిక లోక్ సభ స్థానాలు దక్కించుకోబోతున్నాయని జోస్యం చెబుతూ వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాడు.ముఖ్యంగా బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

జాతీయ నాయకులు అందరితో వరుస వరుసగా భేటీ అవుతూ ఎన్నికల ఫలితాల తర్వాత ఏమి చేయాలి అనేదానిపై చర్చలు సాగిస్తున్నారు.ముఖ్యంగా నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాను, లక్నో వెళ్లి మాయావతి, అఖిలేష్ యాదవ్ తదితర కీలక నాయకులను కలుసుకున్నారు.

జాతీయ నేతలతో వేర్వేరుగా భేటీ అవుతున్న చంద్రబాబు ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై వారందరితో చర్చిస్తున్నారు.

ఎన్డీయేతర పక్షాలను బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై లోతుగా చర్చలు సాగిస్తున్నారు.ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే అంశాలపై ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో అధికారంలోకి రాకూడదు అనే కృత నిశ్చయంతో బాబు తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టి మరీ ప్రాంతీయ పార్టీల నాయకులను ఏకం చేసే పనిలో పడ్డాడు.

-Telugu Political News

మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అధికశాతం సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమాగా చెప్పేస్తున్నాడు.ఏపీలో గత ఎన్నికల ఫలితాలే మళ్ళీ పునరావృతం అవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చంద్రబాబు రిపోర్ట్ అందించాడట.అయితే బాబు అనుకున్నట్టుగా బీజేపీయేతర ఫ్రంట్ బలపడుతుందో లేక మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందో మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.

అసలు ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని ప్రాంతీయ పార్టీల నాయకుల వద్దకు వెళ్లి చర్చలు జరపడం పూర్తయ్యింది.కాకపోతే ఇప్పుడు ఆ హడావుడి బాబు చేస్తున్నాడు అంతే .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube