అమెరికా తాజా నిర్ణయం..భారతీయులకి మేలే

అమెరికాలో శాశ్వత సభ్యత్వం ఖరారు చేసే గ్రీన్ కార్డ్ కోటా విషయంలో అమెరికా ప్రభుత్వం నూతన విధానాన్ని అనుసరిస్తోంది.ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చి ప్రతిభావంతులకే పట్టం కట్టాలని ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 Americas Latest Decision Is To Be Indians-TeluguStop.com

ఈ మేరకు తన శ్వేత సౌధంలో ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్స్ లో ప్రసంగించనున్న ట్రంప్ నూతన వలస విధానంపై కీకల ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

రోజ్‌గార్డెన్‌లో ప్రసంగించనున్న ట్రంప్‌ నూతన వలన విధానాలపై కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు తన అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ ఇచ్చిన కొన్ని సూచనల మేరకు అమెరికా సాంకేతిక అవసరాలని తీర్చే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది, అంటే ప్రతిభ ఉన్నవారికే పట్టం కట్టే ఆలోచన ట్రంప్ చేస్తున్నారు.

అయితే , ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులని వివాహం చేసుకునే వారికి 66 శాతం , అలాగే వేరు వేరు రంగాలలో నిపుణులు అయిన వారికి 12 శాతం గ్రీన్ కార్డ్స్ జారీ చేస్తున్నారు కానీ.

ప్రస్తుతం రాబోతున్న కొత్త విధానం వలన నూటికి నూరు శాతం ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

అదే జరిగితే భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లేవారికి, అక్కడ హెచ్‌1బీ వీసాలపై ఉన్న వారికి తక్కువ సమయంలోనే గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది భారతీయులకి ఈ తాజా నిర్ణయం లబ్ది చేకూర్చనుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube