ఆ దేశంలో ముగ్గురుని పెళ్లి చేసుకోవాల్సిందే! లేదంటే జైలు శిక్ష

కొన్ని దేశాలలో ఇప్పటికి కరుడు గట్టిన ఆచారాలని పాటిస్తూ ఉంటారు.ప్రాచీన సంప్రదాయాలలో ఉండే బహు భార్యత్వం ఇప్పటికి కొనసాగించే దేశాలు చాలా ఉన్నాయి.

 King Mswati Of Swaziland Orders Men In His Country To Marry More Than Two Wives-TeluguStop.com

ముఖ్యంగా విదేశాలలో అయితే బహు భార్యత్వం లేకున్న ఒక భార్యకి విడాకులు ఇచ్చి మరో భార్యని పెళ్లి చేసుకోవడం ద్వారా చాలా మంది ఎక్కువ మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు.అయితే ఒక దేశంలో బహు భార్యలని కలిగి ఉండాల్సిందే అని ఆ దేశ అధ్యక్షుడు ఏకంగా హుకుం జారీ చేసాడు.

ముగ్గురు కంటే తక్కువ మందిని పెళ్లి చేసుకుంటే జైల్లో పెడతామని కూడా హెచ్చరించారు.

దక్షిణ ఆఫ్రికా ఖండంలో అతి చిన్న దేశం అయిన స్వాజీలాండ్ అధ్యక్షుడు మోస్వాతి దేశంలో ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని ఓ చట్టం తీసుకొచ్చారు.

దేశంలో మగవాళ్ళు అందరూ ముగ్గురు భార్యలని కలిగి ఉండాలని, అంతకంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం తరుపున ఇళ్ళు మంజూరు చేస్తామని కూడా మోస్వాతి హామీ ఇచ్చారు.అతను కూడా ఇప్పటి వరకు 15 మంది భార్యలని కలిగి ఉన్నాడు.

అతని తండ్రి 70 మహిళలని భార్యలుగా చేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube