యూఏఈ తీరానికి సమీపంలో సౌదీ ఇంధన నౌకల పై దుండగుల దాడి

సౌదీ అరేబియా దేశనానికి చెందిన రెండు నౌకలపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.దక్షిణ అమెరికా లో వెనిజులా తరువాత ఇస్లామిక్ దేశం అయినా సౌదీ లో ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉన్న సంగతి తెలిసిందే.

 The Attack On The Soudi Ferry Ships-TeluguStop.com

అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తీరానికి సమీపంలో సౌదీ కి చెందిన రెండు ఆయిల్ నౌకల పై ముష్కరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.యూఏఈ తీరానికి సమీపంలో ఈ దాడి జరిగింది అని సౌడీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ ఆల్ ఫలీహ్ తెలిపారు.

అంతేకాకుండా ఈ నౌకలపై భీకర దాడి జరిగిందని ఆయన తెలిపారు.

సౌదీ నౌకలు అరేబియన్ గల్ఫ్ దాటుతున్న క్రమంలో ఈ దాడి జరిగిందని, ఆ సమయంలో త్యాంకర్ లో ముడి చమురు నిండుగా ఉందని అయితే అదృష్ట వశాత్తు ఆయిల్ సముద్రంలోకి ఒలకలేదని ఆయన వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ నౌకాయానం స్వేచ్ఛగా సాగాల్సిన అవసరముందని, ఇందుకు ప్రపంచదేశాలన్నీ కలసి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.దక్షిణ అమెరికాలో వెనిజులా తర్వాత సౌదీ అరేబియానే ఆయిల్ నిల్వల విషయం లో ముందుండి.సౌదీలో 268 బిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వులు ఉండగా,ప్రస్తుతం సౌదీ రోజుకు 7.6 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube