వైరల్‌ : అందమైన పోలింగ్‌ అధికారిణి, ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యింది

దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు కనిపిస్తున్నాయి.

 A Beautiful Polling Officer Become Star In Overnight-TeluguStop.com

అవి సోషల్‌ మీడియాలో చాలా హంగామా చేస్తున్నాయి.ఒకప్పుడు ఎన్నికల సిత్రాలు అంటే అభ్యర్థులు ఆ పనులు ఈ పనులు చేయడం వరకే.

కాని ఇప్పుడు అలా కాదు.ఎన్నికల్లో చేసిన అభ్యర్ధుల నుండి ఎన్నికలు నిర్వహించే అధికారుల వరకు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.

ఇప్పటి వరకు ఆరు దశల పోలింగ్‌ జరిగింది.అయితే అయిదవ దశ ఎన్నికల సమయంలో మాత్రం ఒక ఎన్నికల అధికారిణి ఫొటోలు బాగా వైరల్‌ అయ్యాయి.

చూడ్డానికి హీరోయిన్‌గా ఉన్న ఆమె ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంను పట్టుకు పోవడం ఒక ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించాడు.పసుపు పచ్చ చీర, హీరోయిన్స్‌ కట్టుకునే విధంగా నడుము కనిపించేలా, కట్టుకుని, చాలా అందంగా ఆమె ఉంది.

కూలింగ్‌ గ్లాస్‌ తో పాటు ఇంకా ఆమె స్టైల్‌ చూసి ఎవరైనా మతి పోవాల్సిందే.ఆ ఫొటోలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.దాంతో ఆ ఫొటోల గురించి ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్‌ చేశారు.ఈమె విధులు నిర్వహించిన వద్ద 100 శాతం ఓటింగ్‌ నమోదు అయ్యి ఉంటుందని, ఓటర్లు ఆమెను చూసేందుకు అయినా ఎగబడి మరీ ఓటు వేసి ఉంటారు అంటూ ప్రచారం చేశారు.

ఆమె ఫొటోలు బాగా వైరల్‌ అవ్వడంతో ఆమె ఎవరనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నం జరిగింది.

వైరల్‌ : అందమైన పోలింగ్‌ అధికా

చివరకు ఆమె ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది.ఆమె యూపీలోని లక్నోకు చెందిన వారని తెలిసింది.లక్నోలో పీడబ్ల్యూడీ ఆఫీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌.

ఆమె పేరు రీనా ద్వివేది.లక్నోలోని 173 పోలింగ్‌ బూత్‌లో ఆమె విధులు నిర్వహించింది.

ఇక ఆ చీర కట్టుకున్నది ఎన్నికల రోజు కాదని, ఎన్నికలకు ముందు రోజు అని చెప్పుకొచ్చింది.ఇక తాను విధులు నిర్వహించిన బూత్‌లో 70 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదు అయ్యిందని కూడా చెప్పుకొచ్చింది.

ఈ ఫొటోను తుషార్‌ రాయ్‌ అయే ఫొటో జర్నలిస్ట్‌ తీశాడు.ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో నాతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.

అయితే ఇది నాకు సమస్యలు కూడా తెచ్చి పెట్టిందని ఆమె అంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube