ఆదర్శం : ప్రపంచాన్నే ఊపేసిన మన 'కింగ్స్‌'... రూ.500లతో మొదలు పెట్టి రూ. 6 కోట్లకు ఎదిగారు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్బుతమైన డాన్సర్స్‌గా మారుమ్రోగిపోతున్న టీం పేరు ‘ది కింగ్స్‌ యునైటెడ్‌’.ముంబయికి చెందిన ఈ టీం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలిసి పోయింది.

 The Kings Won World Of Dance Competition-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాన్స్‌ ప్రియులు వీరి డాన్స్‌ గురించి, సాహసాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఇటీవలే ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన ‘వరల్డ్‌ ఆఫ్‌ డాన్స్‌’ స్టేజ్‌పై వీరు వేసిన డాన్స్‌కు ప్రపంచమే ఊగిపోయింది.

డాన్స్‌లలో వీరు చేసిన సాహసాలు కొందరు కళ్లు సగం మూసి చూశారు అంటే ఎలాంటి ఫీట్లు వీరు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ది కింగ్స్‌ ప్రస్థానం సక్సెస్‌తో ఏమీ ప్రారంభం కాలేదు.

ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని, ఆర్ధిక సమస్యలను నెత్తిన మోసి చివరకు ఈ స్థాయికి చేరుకున్నారు.

ఆదర్శం : ప్రపంచాన్నే ఊపేసిన మన

ముంబయికి చెందిన హిప్‌ హాప్‌ డాన్స్‌ టీం నే ది కింగ్స్‌ అంటూ పేరు మార్చుకుని అంతర్జాతీయ వేదికలపై సందడి చేస్తోంది.ది కింగ్స్‌లో 14 మంది సభ్యులు ఉంటారు.వీరు మొదటి స్టేజ్‌ షోకు వచ్చిన ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా 500 రూపాయలు, అవును నిజంగా 500 రూపాయలతోనే వీరి ప్రస్థానం ప్రారంభం అయ్యింది.ఆ రోజు వీరు 500 రూపాయల ప్రైజ్‌ మనీతో తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి ఇంకా పలు రియాల్టీ షోల్లో పాల్గొనేలా చేశాయి.2009వ సంవత్సరంలో సురేష్‌ ముకుందన్‌, వెర్నస్‌ కలిసి ఈ టీంను ఏర్పాటు చేయడం జరిగింది.అప్పటి నుండి ఎన్నో స్టేజ్‌ షోలు ఇచ్చారు.2011వ సంవత్సరంలో టాలెంట్‌ సీజన్‌ 3లో మొదటి స్థానం దక్కించుకోవడంతో దేశం మొత్తం వీరిని చూడటం జరిగింది.
ఆ తర్వాత ఎన్నో, ఎన్నో అద్బుత విజయాలను వీరు అందుకున్నారు.ప్రతి విజయం కూడా వీరిలో ఆత్మవిశ్వాసంను పెంచుతూనే వచ్చింది.ప్రతి షోకు తమ కష్టంను పెంచుకుంటూ పోయారు.కొత్తదనంను చూపించేందుకు ప్రయత్నించారు.

ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా కష్టపడి అద్బుతమైన బాడీ మూవ్స్‌తో గుర్తింపు దక్కించుకున్నారు.తాజాగా వరల్డ్‌ ఆఫ్‌ డాన్స్‌ మూడవ సీజన్‌లో అద్బుత ప్రదర్శణకు గాను 100కు 100 మార్కులు పొంది అందరిని ఆశ్చర్యపర్చారు.

జడ్జ్‌లు వీరి ప్రతిభకు ఫిదా అయ్యారు.వీరు ఫైనల్‌ రౌండ్‌లో పవన్‌ కళ్యాణ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ పాటకు డాన్స్‌ వేయడం విశేషం.ఆ పాటకు డాన్స్‌ వచ్చిన సమయంలో జడ్జ్‌లు నిలబడి మరీ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.500 ప్రైజ్‌ మనీ దక్కించుకున్న ది కింగ్స్‌ సరిగ్గా పది సంవత్సరాల్లో ఏకంగా 10 మిలియన్‌ల డాలర్లు అంటే 6 కోట్లకు పైగా ప్రైజ్‌ మనీని దక్కించుకున్నారు.

ఆదర్శం : ప్రపంచాన్నే ఊపేసిన మన

కష్టపడితే ఏదైనా సాధ్యమే అని చెప్పేందుకు ది కింగ్స్‌ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ప్రతి ఒక్కరు కూడా అద్బుతమైన ప్రతిభ కలిగి ఉన్నారు.వీరంతా కూడా ఎంతో మందికి ఆదర్శం అవ్వాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube