అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం

రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అపహరణకు గురైన 8 రోజుల పసిపాప ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.రెండు రోజుల క్రితం చిన్నారి కి కామెర్లు కారణంగా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంకి చిన్నారి తల్లి దండ్రులు మాధవి-మల్లేశం లు తీసుకు వెళ్లారు.

 Sangareddy Hospital Missing Baby Is Safe-TeluguStop.com

అయితే వైద్యం అనంతరం తల్లి దండ్రులకు బదులుగా గుర్తు తెలియని మహిళకు అప్పగించడం తో చిన్నారి అపహరణకు గురైంది.మంగళవారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే దీనితో కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టారు.

అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ

అక్కడి దగ్గరలోని సీసీ కెమెరా లను పరిశీలించి మొత్తానికి ఆ చిన్నారి ఆచూకీ ని కనిపెట్టారు.కామారెడ్డి జిల్లా ఎల్లా రెడ్డి సమీపంలో పోలీసులు శిశువును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితులను అదుపులోకి తీసుకొని అధికారులు విచారణ చేపట్టారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 25 మంది కానిస్టేబుళ్లతో పాటు ఇతర పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలించగా శిశువు ఆచూకీ లభించడం తో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube