భారతీయ విద్యార్ధినికి అమెరికా యూనివర్సిటీల...రెడ్ కార్పెట్..!!!

అమెరికాలో చదువుకోవాలంటే మామూలు విషయమా, అక్కడ వర్సిటీలు నిర్వహించే పరీక్షలలో పాస్ అవ్వాలి.లేకపోతే పెద్ద మొత్తంలో డొనేషన్స్ కట్టి చదువుకోవాలి.

 America Universities Welcomes Indian Student-TeluguStop.com

అయినా సరే సీటు పక్కా వస్తుందనే నమ్మకం సూన్యం.కానీ భారతీయ విద్యార్ధినికి మాత్రం అమెరికాలోని 7 వర్సిటీలు మా దగ్గర చేరండి అంటూ లేఖలు పంపాయి

ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుంది, అనే వివరాలలోకి వెళ్తే.

ఆమె పేరు సిమోనే నూరాలీ 17 ఏళ్ల ఈ యువతి చదువుల్లో చిన్నప్పటి నుంచీ రాణించేదట.తమ తల్ల్లి తండ్రులు దుబాయ్ లో సెట్ అవడంతో వారితో పాటు దుబాయ్ లో ఉంటున్న ఆమె అమెరికాలో చదువుకోవడానికి అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ లు రాసింది.

అయితే ఆ ఏసీటీ పరీక్షలో 36కు 36 పాయింట్లు సాధించింది దాంతో


అమెరికాలో ప్రఖ్యాత 7 యూనివర్సిటీలు ఆమెని తమ వర్సిటీలో చేర్చుకోవడానికి ఆమెకి సందేశం పంపాయి.అవి యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, డార్ట్‌మౌత్‌ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం, జార్జ్‌టౌన్‌ వర్సిటీ, జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ.

అంతేకాదు భారత్ లో మహిళ అక్రమ రవాణాపై ఆమె రాసిన ది గర్ల్ ఇన్ ది పింక్ రూమ్ పుస్తకాన్ని పరిశోధన కోసం వాడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube