ఆమె తన ఆరుగురు పిల్లలను, భర్తను చంపిన సోదరుడిని క్షమించింది... కన్నీరు పెట్టించే రియల్‌ స్టోరీ

క్షమా గుణం అనేది అందరిలో ఉండదు.అది కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తుంది.

 She Forgiven Her Brother Who-TeluguStop.com

క్షమించడం అనేది మంచిదే, అయితే దానికి ఒక మోస్తరుగా లిమిట్‌ ఉంటుంది.ప్రతి ఒక్కరిని క్షమించుకుంటూ పోతే అది చేతకాని తనం అవుతుంది.

తన వారికి ఏదైనా అన్యాయం చేసినా, తన వారిని చంపేసినా, తనకు ఏదైనా అన్యాయం చేసినా వారిని క్షమించడం అనేది చాలా మంచి గుణమే అయినా అది అన్ని సార్లు పనికి రాదు.తాజాగా ఆఫ్రికాకు చెందిన మోనిక కాంబీ అనే 57 ఏళ్ల మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను చంపిన సోదరుడిని క్షమించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… 25 ఏళ్ల క్రితం మోనిక కాంబీ సోదరుడు అయిన పౌల్‌ తాహిర్వా కుటుంబ కలహాల కారణంగా రాక్షసంగా మారాడు.సోదరి మోనిక భర్తతో గొడవకు దిగిన పౌల్‌ ఆ సమయంలో విచక్షణ కల్పోయాడు.

తాను అడిగింది ఇవ్వలేదు అనే ఉద్దేశ్యంతో బావ అనే విషయాన్ని మర్చి పోయి, సోదరి భర్త అనే విషయంను కూడా పట్టించుకోకుండా విచక్షణ లేకుండా చంపేశాడు.అత్యంత దారుణమైన ఆ పరిస్థితుల నుండి మోనిక భర్త బయట పడలేక పోయాడు.

ఆ సమయంలోనే పౌల్‌కు అక్కడే ఉన్న మోనిక పిల్లలు కనిపించారు.

బావపై కోపంతో వారిని కూడా చంపేశాడు.

ఆరుగురు పిల్లలను కూడా చంపేశాడు.తన సోదరి రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు అనే విషయం అప్పుడు అతడికి గుర్తు రాలేదు.

అతడి మనసులో నిండి ఉన్న ద్వేశం మొత్తం అతడిని గుడ్డి వాడిని చేసింది.భర్త, పిల్లలు మరణంతో మోనిక జీవితం చీకటి అయ్యింది.

గత పాతిక సంవత్సరాలుగా ఆమె ఏదో జీవిస్తున్నాను అంటే జీవిస్తున్న అన్నట్లుగా సాగుతుంది.తాజాగా పౌల్‌ జైలు జీవితంను ముగించుకుని వచ్చాడు.

అయితే తన సోదరుడిని క్షమించి దగ్గరకు తీసుకుంది.జీవితంలో నాకు ఎవరు లేరు, ఇప్పుడు సోదరుడిని కూడా దూరం పెట్టలేను అంటూ కన్నీరు పెట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube