టీఆర్ఎస్ లోకి వలసలు ! కేసీఆర్ అసలు ప్లాన్ ఇదా ?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఉదృతంగా సాగిన నాయకుల వలసలపై పెద్ద ఎత్తున చర్చ నడించింది.ఇతర పార్టీల్లో కీలమైన నాయకులు అనుకున్న వారందరిని కారెక్కించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు.

 Kcr Master Plan-TeluguStop.com

ఇక తెలంగాణాలో టీఆర్ఎస్ అధికారంలోకి కూడా వచ్చేసింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా కొంతమంది ఇతర పార్టీ ఎమ్యెల్యేలను టీఆర్ఎస్ లోకి చేర్చేసుకున్నారు.

ఆ తరువాత ఆ వలసలకు కాస్త బ్రేక్ పడింది.తాజాగా ఈ వలసలు ఇప్పుడు ఉపందుకోవడం వెనుక కేసీఆర్ వ్యూహం బయటపడుతోంది.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్యెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి కేసీఆర్ తీవ్ర కసరత్తే చేసాడు.

తన కుమారుడు, రాజకీయ వారసుడైన కేటీఆర్ కు రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

దానికోసమే ఇతర పార్టీల్లో బలమైన నాయకులు ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వారందరిని టీఆర్ఎస్ లో చేరేలా తెరవెనుక మంత్రంగం నడుపుతున్నాడు.నియోజకవర్గాల వారీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చేస్తే ఈ ఐదేళ్లూ సజావుగా సాగడమే కాకుండా, 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్షానికి అభ్యర్థిలే దొరకకుండా చేయాలన్నదే కేసీఆర్ అసలు వ్యూహంగా తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు పార్టీ మారితే అంతో ఇంతో కేడర్ కూడా వారిని అనుసరిస్తుంది.మిగిలిన కేడర్ కూడా సహజంగానే కొంత మేరకు నిరాశకు గురవుతుంది.ఈ క్రమంలో అక్కడ కొత్త నాయకత్వం ఎదగడం కష్టమైన పనే అవుతుందని కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నాడని ఆయన సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు.కేసీఆర్ కూడా ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకునే ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దాదాపు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం సహజం.దానిని ఈ విధంగా కవర్ చేసి అటు పార్టీకి, ఇటు కేటీఆర్ కి ఇబ్బంది లేకుండా చేసేపనిలో కేసీఆర్ ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube