పెళ్లి తర్వాత రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది... సీక్వెల్‌తో సందడి

బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన స్వాతి ఆ తర్వాత వెండి తెరపై ఆకట్టుకుంది.వెండి తెరపై ఈ అమ్మడు ఆకట్టుకుంది.

 Colours Swathi Re Entry With Karthikeya Sequal-TeluguStop.com

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ మరియు మలయాళంలో కూడా ఈమె నటించింది.తెలుగులో ఈమె చేసిన పలు సినిమాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి.

అయినా కూడా ఈమెకు స్టార్‌ హీరోలతో నటించే అవకాశం దక్కలేదు.అవకాశాలు లేక వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ స్వాతి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

స్వాతి కెరీర్‌లో ‘కార్తికేయ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.2014లో ఈ చిత్రం వచ్చింది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.కార్తికేయ చిత్రంకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో స్వాతిని హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమాలు చేయకుండా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్న స్వాతి తప్పకుండా ఒక మంచి సినిమాతో ఎంట్రీ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది.తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం అనిపిస్తే చేస్తాను అంది.

‘కార్తికేయ 2’ చిత్రం గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది.స్వాతికి ఈ చిత్రంలో ఛాన్స్‌ ఇస్తారా లేదా అనే విషయమై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కార్తికేయ 2 చిత్రంలో స్వాతి నటిస్తుందని చెబుతున్నారు.ఇక ఈ చిత్రం కథ పూర్తి విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

రీ ఎంట్రీతో స్వాతి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube