అమెరికా కంటే ఇతర దేశాల పై ఆసక్తి చూపిస్తున్న భారత విద్యార్థులు....

అమెరికా వీసాలు క్లిష్టం అవుతుండటం, ఇక్కడ ఏర్పడిన సందిగ్ధ పరిస్థితుల కారణం గా భారతీయ విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడే కెనడా,జర్మనీ,ఆస్ట్రేలియా,ఐర్లాండ్ వంటి దేశాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

 Indian Students-TeluguStop.com

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య బాగా పెరిగినట్లు కన్సల్టెన్సీ వారి అభిప్రాయం.

అమెరికా తో పోలిస్తే ఈ దేశాలలో ఫీజు లు కూడా తక్కువ ఉండటం వలన కూడా ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడని యూరోప్ వంటి దేశాల వైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

అమెరికా లో అయితే అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, భారతీయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతుండటం, విద్యార్ధులకి తక్కువ జీతాలు, వీసా సమస్యలు వంటి కారణం గా భారతీయ విద్యార్థులు అమెరికా అంటే ఆసక్తి చూపడం లేదు.

భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు పై చదువులు కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడే అందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అమెరికాలో లో విద్యార్థులకు చదువు పూర్తికాగానే ఉద్యోగాలు ఆలస్యం అవ్వడం, వర్క్ పర్మిట్ తక్కువ ఉండటం వంటి కారణాలు కూడా అమెరికా వద్దనుకుంటున్నారు.

అదే జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు వర్క్ పర్మిట్ చదువు పూర్తి ఐన తర్వాత 2 సంవత్సరాలు ఉండటం,ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటం వలన ఈ దేశాలు వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.

ఐర్లాండ్ లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుండటం, జన సంఖ్య తక్కువ ఉండటం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండటం వలన ఐర్లాండ్ కూడా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.

ఆ దేశంలో కార్పొరేట్ పన్ను తక్కువ ఉండటం వలన పలు బహుళ జాతి సంస్థలు కూడ పరిశ్రమలు పెడుతున్నారు.దాంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటం వాళ్ళ అక్కడ ప్రభుత్వం ఫీజు లు తగ్గించి, వర్క్ పర్మిట్ 2 సంవత్సరాలు ఇస్తున్నారు.

అందుకే మన విద్యార్థులు ఐర్లాండ్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అమెరికా కంటే కెనడా లో సుమారు 20 శాతం,బ్రిటన్ లో 40 ,ఐర్లాండ్ లో 60 – 70 శాతం ఫీజు లు ఎక్కువ అని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube