అమెరికాకి చుక్కలు చూపించిన హ్యాకర్స్

అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాకి చుక్కలు చూపించారు కొంతమంది హ్యాకర్స్.తమని ఎటువంటి రంగంలో అయినా సరే డీ కొట్టగలిగే వారు లేరని అనుకునే అమెరికాకి కొంతమంది యువకులు షాక్ ఇచ్చారు.

 Hackers Giving Tension To America-TeluguStop.com

అమెరికాకి ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీ ఐ కి చెందిన అనేక వెబ్ సైట్లను హ్యాక్ చేశారు.ఆ సైట్స్ నుంచీ వేలాదిమంది అమెరికా ఫెడరల్ ఏజెంట్స్ పోలీస్ అధికారుల వివరాలు బయటపెట్టినట్టుగా టెక్ వెబ్ సైట్ టెక్ క్రంచ్ తెలిపింది.

అయితే తమ దగ్గర మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని వాటిని మేము అమ్మదలిచామనే విధంగా ఓ ప్రకటన కొదొఆ చేసినట్టుగా తెలిపారు.10 మందికి పైగా హ్యాకర్ల బృందం హ్యాకర్ల బృందం ఎఫ్ బీ ఐ నేషనల్ అకాడమీ అసోసియేషన్ తో సంభంధం ఉన్న మూడు వెబ్సైటు లలోకి చొరబదిందని తెలిపింది.ప్రతి వెబ్ సర్వర్ నుంచి వివరాలన్నిటినీ డౌన్ లోడ్ చేసినట్టు ఆన్ లైన్ పబ్లిషింగ్ కంపెనీ టెక్ క్రంచ్ వివరించింది.

అయితే ఆ హ్యాకర్స్ దొంగిలిచిన డేటా లో సుమారు 4,000కి పైగా రికార్డులు ఉన్నాయి.ఈ ఫైల్స్ లో సభ్యుల పేర్లు, వ్యక్తిగత, ప్రభుత్వ ఈమెయిల్ ఐడీలు, హోదాలతో సహా పోస్టల్ అడ్రస్ లు అన్నీ ఉన్నాయని ఆ వెబ్సైటు తెలిపింది.ఇదిలాఉంటే తమ వద్ద యూఎస్ ఫెడరల్ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే ఉద్యోగులకి సంబంధించిన వివరాలు అధిక సంఖ్యలు ఉన్నట్టుగా హ్యాకర్స్ ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube