ఆ రెండు పార్టీలు ద్రుష్టి జనసేన పైనే

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి.అధికార, ప్రతిపక్ష పార్టీలు బయటికి మేమే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్న లోలోపల మాత్రం చాలా టెన్సన్ గా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

 Tdp And Ysrcp Concentrate On Janasena-TeluguStop.com

కాస్తో కూస్తో వైసీపీ కొంత నమ్మికంగా ఉన్నా అధికారం ఏర్పాటు చేసేంత బలం వచ్చే అవకాశం ఉందా అనే అనుమానం వారిలో బలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక తెలుగుదేశం పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఏపీలో పోలింగ్ సరళి చూసిన తర్వాత చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ రాజకీయాలకి తెరతీసారు.బీజేపీ కుట్ర చేస్తుందని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని, వీవీ ప్యాట్ స్లిప్పులు లేక్కించాలని కొత్త పల్లవి అందుకుంటుంది.

మరో వైపు ఈ సారి అధికారంలోకి రావడానికి తమకి ఉన్న అవకాశం ఏంటి అనే విషయాలపై కూడా కసరత్తు చేస్తున్నాట్లు తెలుస్తుంది.

ఈ రెండు పార్టీలు ద్రుష్టి ఇప్పుడు జనసీన మీద పడింది అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.బయటకి చెప్పుకోలేకపోతున్న జనసేన కారణంగా రెండు పార్టీల ఓట్లకి భారీగా గండి పడింది అని తెలుస్తుంది.ఇక జనసేన పార్టీ ప్రభావం అంతగా ఉండదు అని మొదటి నుంచి ప్రచారం చేసిన ఎన్నికల తర్వాత ఆ పార్టీ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుంది అనే విసహ్యం అధికార, ప్రతిపక్షాలకి క్లారిటీ వచ్చిందని సమాచారం.

దీంతో కౌంటింగ్ తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై రెండు పార్టీలు ప్రత్యేక ద్రుష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube