భారతీయ విద్యార్ధులకి అమెరికా హెచ్చరిక..!!!

అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసించాలని అనుకునే భారతీయ విద్యార్ధులకి అమెరికా కొన్ని సూచనలు చేసింది.ఇక్కడ చదువుకోవాలని అనుకునే వారు తప్పకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిచాలని తెలిపింది.

 America Warns To Students From Other Countries-TeluguStop.com

విద్యార్ధులు ఏ యూనివర్సిటీలలో అయితే చేరాలని వస్తున్నారో ఆయా యూనివర్సిటీ లలో అడ్మిషన్లు తీసుకునే ముందే తెలివిగా వ్యవహరించాలని సూచించింది.ఈ మేరకు అమెరికా అధికారులు మూడు అంశాలని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

గడిచిన కాలం జనవరిలో పే టూ స్టే వీసా స్కాం లో నకిలీ యూనివర్సిటీలలో పేర్లు నమోదు చేసుకున్న 129 మంది భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలోనే ఈ సూచనలు చేశారు అధికారులు.అసలు సదరు యూనివర్సిటీ ఒక క్యాంపస్‌ నుంచే నడుస్తున్నదా? పరిపాలనా విభాగంలోనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారా? అంటూ పలు విషయాలని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.

ఇవన్నీ లేని పక్షంలో వెంటనే ఆ యూనివర్సిటీ లలో చదవాలనే విషయాన్ని పక్కకి పెట్టేయండి అని తెలిపారు.ఒక వేళ అలా లేని పక్షంలో నకిలీ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు రెగ్యులర్‌ వీసా పొందినా సరే వీసా ఉల్లంఘనగా పరిగణించి వారిని వెనక్కి పంపెస్తామని హెచ్చరించారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube