ఆకస్మిక గుండె పోటుపై “నాట్స్, టాంటెక్స్”.. అవగాహన సదస్సు..!!!

ప్రపంచంలో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.ప్రాణాపాయ రక్షణ విషయం అందరికి తెలియాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం.

 Nats Awareness Convention On The Sudden Heart Attacks-TeluguStop.com

ఇందులో భాగంగానే నాట్స్ మరియు టాంటెక్స్ రెండు తెలుగు సంఘాలు కలిసి అమెరికాలో సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది.సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా మనలని మనం లేదా ఇతరులని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమాన్ని శనివారం అమెరికాలోని అర్వింగ్ లోని బిర్యాని పాట్ హిల్ టాప్ ప్రాంగణంలో నిర్వహించారు.సరియైన సమయానికి ప్రాణరక్షణ ప్రక్రియలో అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్యని తెలిపారు.

సిపిఆర్ శిక్షణలో ధృవీకృత నిపుణుడు మరియు టాంటెక్స్ దీర్ఘకాల సభ్యుడు కిషోర్ చుక్కల నేతృత్వంలో తెలుగు వారు మూడు సార్లుగా ఇందులో మెళుకువలు తెలిపారు.ఈ ప్రాణరక్షణ ప్రక్రియలో అతిముఖ్యమైన ఘట్టం ఛాతీ ని గట్టిగా మర్దనా చేయడం.

ఆకస్మిక హృద్రోగ సమస్యను వెంటనే గుర్తించి అత్యవసర వ్యవస్థ 911 అప్రమత్తం చేసి వెంటనే ఛాతీ మర్దనా చేయాలి.గుండె కొట్టుకోవడంలో మార్పులని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని తెలిపారు.

ఛాతి మర్ధన పది సెకండ్లలోపు మొదలు పెట్టాలని, నోటి ద్వారా శ్వాస అందించే అవసరం లేదని ఆయన తెలిపారు.నాట్స్ ఆధ్వర్యంలో మే 24 నుండి 26 వరకు డాలస్ మహానగరంలోని అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు ఎంతో ఘనంగా సాగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube