మెగా హీరోకి జోడీగా అవకాశం పట్టిన నితిన్ గర్ల్ ఫ్రెండ్

లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ భామ మేఘా ఆకాశ్.తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తనధైన గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న ఈ భామ గ్లామర్ విషయంలో తెలుగు ఆడియన్స్ ని భాగానే ఆకట్టుకుంది.

 Megha Akash Romance With Mega Hero-TeluguStop.com

అయితే లై సినిమా ఫ్లాప్ కావడంతో ఈ భామకి గుర్తింపు రాలేదు.ఇక రెండో సినిమాని కూడా నితిన్ తోనే చల్ మోహన రంగా అంటూ వచ్చింది.

అది కూడా డిజాస్టర్ అయ్యింది.దీంతో ఈ భామని తెలుగు దర్శకులు పట్టించుకోవడం మానేశారు.

ఇదిలా ఉంటే తెలుగులో సత్తా చాటి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశపడుతున్న ఈ భామకి ఊహించని ఆఫర్ వచ్చింది అని చెప్పాలి.స్టార్ దర్శకుడు సుకుమార్ తన ప్రొడక్షన్ లోనే మెగా హీరో వైష్ణవ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాశ్ ని తీసుకున్నాడు.

మొత్తానికి ఇలా అయిన మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి అదృష్టం కలిసి వస్తే మెగా హీరోలందరితో జత కట్టె అవకాశం వస్తుంది.లేదంటే మళ్ళీ తమిళ సినిమానే దిక్కు అని చెప్పాలి.

మరి ఈ భామ లక్ ఫ్యాక్టర్ లా ఉంటుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube