హిందూ ఆలయాల చుట్టూ హాలీవుడ్ హీరో ప్రదక్షిణలు

విల్ స్మిత్ అంటే వెంటనే అందరికి మెన్ ఇన్ బ్లాక్ మూవీ సిరిస్ గుర్తుకొస్తుంది.అలాగే అతను నటించిన మరికొన్ని సినిమాలు కూడా గుర్తుకొస్తాయి.

 Will Smith Pray To Hindu Gods In India-TeluguStop.com

ఓ విధంగా చేపపలంటే హాలీవుడ్ లో స్టార్ హీరో అని చెప్పాలి.అలాంటి వ్యక్తి ఇండియాలో అది కూడా ఓ సాధారణ భక్తుడులా దేవుళ్ళని దర్శించుకోవడం చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు అదే జరుగుతుంది.విల్ స్మిత్ హిందూ దేవతల్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విల్ స్మిత్ కి హిందూ సంప్రదాయాలు, ఇక్కడి దేవుళ్ళు అంటే విపరీతమైన భక్తి.అందుకే తరుచుగా తాను ఎక్కడ ఉన్న హిందూ ఆలయాలకి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాడు.

గతంలో ఓ శివాలయంకి వెళ్లి అభిషేకం కూడా నిర్వహించాడు.తాజాగా హరిద్వార్ కి వచ్చిన విల్ స్మిత్ అక్కడ దైవ దర్శనం చేసుకొని అనంతరం గోల్డెన్ టెంపుల్ కి వెళ్లి పూజలలో ఓ సాధారణ భక్తుడులా పాల్గొన్నాడు.

ఇప్పుడు ఈ ఫోటోలు కాస్తా బయటకి వచ్చి సోషల్ మీడియాలో ఏకంగా వైరల్ అయిపోయాయి.ఇప్పటికే ఈ ఫోటోకి కోటిన్నర మంది పైగా లైక్ కొట్టడం ఓ సంచలనం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube