పంజాబ్ , సన్ రైజర్స్ ఇరు జట్లు తమ ఐపీఎల్ చివరి మ్యాచ్ లో పరాజయం పాలయ్యారు.పంజాబ్ చెన్నయ్ పైన , సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పైన ఓటమి పొందారు.
ముఖ్యంగా సన్ రైజర్స్ జట్టు స్వల్ప స్కోర్ కూడా ఛేదించ లేకపోయారు.ఇప్పటి వరకు సన్ రైజర్స్ గెలిచిన మ్యాచ్ లలో ఎక్కువ పాత్ర డేవిడ్ వార్నర్ , బైర్ స్టో లదే అయితే చివరి మ్యాచ్ లో వీళ్ళిద్దరూ ఔట్ అవగా సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ పైన భారం పడింది.
కానీ ఒక్కరు కూడా నిలదొక్కుకోలేదు , గత సీజన్ లో కోల్ కత్తా పరిస్థితి కూడా ఇలానే ఉండేది ఆ జట్టు మునుపటి సీజన్ లో ఓపెనర్ల పైన ఎక్కువ ఆధారపడింది , తరువాత సీజన్ చివరి మ్యాచ్ లలో ఓపెనర్ల విఫలం కారణంగా ప్లే ఆఫ్స్ కి చేరకుండానే నిష్క్రమించింది.ఇకపోతే పంజాబ్ జట్టు చెన్నై తో మ్యాచ్ లో లక్ష్య చేదనలో గేల్ , మయంక్ అగర్వాల్ ఔట్ అయినప్పటికీ రాహుల్ , సర్ఫరాజ్ మెల్లిగా ఆడటం తో చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది.చివర్లో ఒత్తిడి వల్ల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి
ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచ్ లలో ఆడగా పంజాబ్ 3 మ్యాచ్ లలో గెలవగా , సన్ రైజర్స్ జట్టు 9 మ్యాచ్ లలో విజయం సాధించింది.
1)పిచ్ ఎలా ఉండబోతుంది
సన్ రైజర్స్ తో పంజాబ్ మ్యాచ్ మొహాలీ లో జరగనుంది.ఇక్కడి పిచ్ పైన పరుగులు చేయడం కష్టం కొంచం బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ పిచ్ హైదరాబాద్ బౌలర్లకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది.సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఈ పిచ్ పైన నిలదొక్కుకుంటే చాలు గెలిచే అవకాశాలు ఉంటాయి.
2)కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది
కింగ్స్ ఎలెవన్ జట్టు బౌలింగ్ లో బానే ఉన్న బాటింగ్ లో నిలకడ లేక ఇబ్బంది పెడుతుంది.గత మ్యాచ్ లో రాహుల్ , సర్ఫరాజ్ ఇద్దరు భారీ షాట్ లకు ప్రయత్నించకపోవడం టాప్ ఆర్డర్ లో గేల్ , మయంక్ అగర్వాల్ విఫలమవడం ఇబ్బంది పెడుతుంది.ఈ మ్యాచ్ లో శ్యాం కుర్రాన్ ని టాప్ ఆర్డర్ లో పంపించొచ్చు.సన్ రైజర్స్ బౌలింగ్ ని ఎదుర్కొని 150 కి పైగా పరుగులు చేస్తే పంజాబ్ కి గెలిచే అవకాశాలు ఉంటాయి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – కె.ఎల్ .రాహుల్ , క్రిస్ గేల్ , మయంక్ అగర్వాల్ , కరుణ్ నాయర్ , మాన్ దీప్ సింగ్ , శ్యాం కుర్రాన్ , అశ్విన్ , టై , షమీ , అంకిత్ రాజ్పుత్ , ముజీబ్ రెహ్మాన్
3)సన్ రైజర్స్ జట్టు ఎలా ఉండబోతుంది
సన్ రైజర్స్ జట్టు ఎక్కువగా బౌలర్ల పైన లేకుంటే ఓపెనర్ల పైన ఆధారపడి ఉంది.ఈ రెండు విభాగాలు ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ లో అసలు సమిష్టిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు.ఈ మ్యాచ్ లో దీపక్ హుడ్ ని ఆడించకపోవచ్చు.బౌలింగ్ లో భువి , నబి , రషీద్ లతో బలంగా ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (PROBABLE XI ) – డేవిడ్ వార్నర్ , జానీ బైర్ స్టో , మనీష్ పాండే , విజయ్ శంకర్ , యూసుఫ్ పఠాన్ , దీపక్ హుడా , షాకిబ్ ఆల్ హసన్ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , సిద్దార్థ్ కౌల్ , సందీప్ శర్మ
.