అయ్యో పాపం : ఏటీఎం దొంగతనం చేయాలనుకుంటే ఏప్రిల్‌ ఫూల్‌ అయ్యాడు

లక్షలు, కోట్లు దొంగతనం చేసిన దొంగలు కూడా చిన్న చిన్న కారణాల వల్ల పట్టుబడటం మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం.దొంగతనం చేసే ప్రదేశంలో చిన్న వస్తువు ఏదైనా పడేసుకుంటే అది వారిని పట్టిస్తుంది.

 Delhi Atm Theft Is Goes Viral In Social Media-TeluguStop.com

లేదంటే దొంగతనం చేసే సమయంలో వారు చేసే ఏదో ఒక తప్పు వారిని దొరికేలా చేస్తుంది.అయితే ఢిల్లీలోని ఒక ఏటీఎం దొంగకు అత్యంత విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.

ఎంతో తెలివిగా, విభిన్నంగా ఏటీఎంలు దోపిడి చేస్తూ ఢిల్లీ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న దొంగ అస్లామ్‌.ఈయన్ను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసినా కూడా పోలీసులు సఫలం కాలేదు.

పోలీసుల ప్రయత్నంకు పడకుండా, తనంతటా తానే పోలీసులకు చిక్కాడు.

అస్లామ్‌ పోలీసులకు ఎలా చిక్కాడో ఈ కథనంలో చూద్దాం రండి.

ఢిల్లీలో ఏటీఎంల చోరీలు ఎక్కువ అయ్యాయి.ఎంత ప్రయత్నించినా, ఎంతగా దొంగతనాలను నిరోదించేందుకు ప్రయత్నించినా కూడా దొంగలు తెలివిమీరి ప్రయత్నాలు చేస్తున్నారు.అస్లామ్‌ కూడా చాలా ఆధునిక పరికరాలు వాడుతూ ఏటీఎంలకు కన్నం వేశాడు.తాజాగా ఒక ఏటీఎంను కొల్లగొట్టేందుకు రెక్కీ నిర్వహించాడు.రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి మరో వ్యక్తి పరిచయం అయ్యాడు.ఆ వ్యక్తి తనకు తాను నేరస్తుడిగా చిల్లర దొంగతనాలు చేస్తాను అంటూ పరిచయం చేసుకున్నాడు.

ఇద్దరు కూడా చర్చించుకుని దొంగతనంకు ప్లాన్‌ సిద్దం చేసుకున్నారు.

దొంగతనం అనుకున్నట్లుగా చేసేందుకు సిద్దం అయ్యారు.ఇద్దరు కలిసి ఏటీఎం వద్దకు వచ్చారు.ఏటీఎంలోకి ప్రవేశించబోయిన సమయంలో అస్లాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆ మరో వ్యక్తి, దొంగగా చెప్పుకున్న వ్యక్తి అస్లాంను ఏప్రిల్‌ ఫూల్‌, నువ్వు ఫూల్‌ అయ్యావు, నేను పోలీస్‌.నీ బండారం బయట పెట్టేందుకు, నిన్ను అరెస్ట్‌ చేసేందుకు నేను ఈ అవతారం ఎత్తాను అంటూ చెప్పడంతో అస్లామ్‌ నోరు వెళ్లబెళ్లబెట్టాడు.

ఏం చేయాలో పాలుపోక సైలెంట్‌గా ఉండిపోయాడు.అరెస్ట్‌ అయిన అస్లామ్‌ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube