ఆర్ ఆర్ ఆర్ నుంచి తప్పుకున్న హాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ లో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్.రామ్ చరణ్ తారక్ హీరోలుగా డివివి దానయ్య భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 Hollywood Heroine Sign Out From Rrr Movie-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.హిస్టోరికల్ ఫాంటసీగ, వాస్తవిక సంఘటన స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రకని లాంటి స్టార్ట్ కాస్టింగ్ తో పాటు, హీరోయిన్స్ గా బాలీవుడ్ నటి అలియా భట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో తారక్ కి జోడీగా ఓ హాలీవుడ్ హీరోయిన్ దిసీ ఎడ్గర్ జోన్స్ ని జక్కన్న ఫైనల్ చేసాడు.

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న డైసీ ఎడ్గర్ ఊహించని విధంగా ఈ సినిమాకి హ్యాండ్ ఇచ్చింది.

ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం అధికారికంగా ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసింది.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం నుండి తప్పుకుంది.ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఆమె ఇండియన్ మూవీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని టాక్ వినిపిస్తుంది ఇక ఇప్పుడు డైసీ హ్యాండ్ ఇవ్వడంతో జక్కన్న తారక్ కి జోడీగా మరో ఇంగ్లీష్ భామని రంగంలోకి దించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube