అమెరికాలో వీసా మోసం ! నిందితుల్లో ఒకడు వైసీపీ అంటూ రాజకీయం

ఎన్నికల నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలకి చెంది ఎలాంటి నేరాలు జరిగిన వాటిని ఏదో ఒక పార్టీకి ముడిపెట్టి ఆ పార్టీని విభేదించే మీడియా విషప్రచారం చేస్తుంది.ఈ మధ్యకాలంలో జరుగుతున్నా చాలా సంఘటనలలో ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి.

 Ysrcp Nri Activist In H1b Visa Scam-TeluguStop.com

ఎక్కడో ఏదో జరిగితే దానిలో ఉన్న నిందితులు టీడీపీ పార్టీకి చెందిన వారు ఉన్నారని వైసీపీ వారు, అలాగే ఏదో మోసం జరిగితే అందులో వైసీపీ పార్టీ వారే నిందితులు అంటూ టీడీపీ వారు ప్రచారం చేసుకొని ఎన్నికలలో లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

దేశంలో అయిన, విదేశాలలో అయిన మోసాలకి పాల్పడే వారు ఏదో ఒక పార్టీని ఇష్టపడే వ్యక్తిగానో, లేక పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వ్యక్తిగానో ఉన్నంత మాత్రాన ఆ పార్టీనే ఆ నేరాలని ప్రోత్సహిస్తుంది అన్న విధంగా ప్రాజెక్ట్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది రాజకీయ పార్టీల నేతలకే తెలియాలి.

ఆ మధ్య కాల్ మనీ రాకెట్ తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.అయితే అందులో టీడీపీ, వైసీపీ పార్టీలలో క్రియాశీలక నేతలుగా ఉన్న చాలామంది ఉన్నారు.అయితే ఈ రెండు పార్టీలు మాత్రం ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు.

ఇదిలా ఉంటే అమెరికా కేంద్రంగా ఓ ముగ్గురు తెలుగు ఎన్నారైలు హెచ్1 వీసాల మాటున భారీ మోసానికి పాల్పడ్డారు.ఇప్పుడు వారిని అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేసారు.ఇక ఇందులో నేరం రుజువైతే వారికి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఇప్పుడు ఈ కేసు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది.దీంతో దీనిని టీడీపీ అనుకూల మీడియా వైసీపీ పార్టీకి ఆపాదించే ప్రయత్నం మొదలెట్టింది.హెచ్1బి వీసా మోసం కేసులో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఒకరు వైసీపీ పార్టీ ఎన్నారై విభాగంలో కీలకంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చింది.

ముగ్గురు నిందితుల్లో ఒకరైన కుమార్‌ అశ్వపతి వైసీపీలో క్రియాశీలక సభ్యుడు.ఆ పార్టీ ఎన్నారై విభాగం అమెరికాలో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో అతను పాల్గొన్నాడు అని ప్రస్తావించింది.అయితే ఎక్కడో అమెరికాలో మోసం జరిగితే ఇక్కడ ఏపీలో వైసీపీ పార్టీకి ఆపాదించడం ఎంత వరకు సరైన పద్ధతి అంటూ రాజకీయ వర్గాలలో విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube