ఈ రోజు ఐపీఎల్ లో ముంబై తో చెన్నై మ్యాచ్ ... ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి..

ఐపీఎల్ లో రోజు రోజుకి మ్యాచ్ లు చూస్తున్న ప్రేక్షకులు ఉత్కంఠ కి గురవుతున్నారు.ఆడిన 3 మ్యాచ్ లు గెలిచి మంచి ఊపు మీద ఉన్న చెన్నై తో ముంబై ఇండియన్స్ ఆడనుంది.

 Today Ipl Matches Between Mumbai Indians Vs Chennai Super Kings-TeluguStop.com

ఈ రెండు జటూ అటు బ్యాటింగ్ లోను , ఇటు బౌలింగ్ లోను పటిష్టంగా ఉన్నాయి.చెన్నై జట్టు కి అనుభవజ్ఞులై న ఆటగాళ్లు ఉండడం తో వాళ్ళు ప్రెషర్ లో బాగా ఆడగలుగుతున్నారు.

ఇకపోతే ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ వరుసగా విఫలమవుతుంది.గత రెండు మ్యాచ్ లలో చివర్లో హార్దిక్ పాండ్య మెరుపులు మినహాయించి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వల్ల ముంబై కి ఏం ఉపయోగం లేకపోయింది.

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల రికార్డ్ లు ఎలా ఉన్నాయి.


చెన్నైకి ముంబైకి మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచ్ లు జరగగా చెన్నై మీద ఏ జట్టుకి లేని రికార్డ్ గా ముంబై 13 మ్యాచ్ లు గెలిచింది.చెన్నై 11 మ్యాచ్ లలో గెలుపొందింది.ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

పిచ్ ఎలా ఉండబోతుంది


ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అవన్తా మైదానం అయిన వాకండే లో జరగనుంది.ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది.టాస్ గెలిచిన జట్టు లక్ష్య చేదనకు ఇష్టపడుతారు.

ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది


ముంబై ఇండియన్స్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ తో సతమతమవుతుంది.ఓపెనర్లు రోహిత్ , డికాక్ లు మంచి ఆరంభలు ఇస్తున్న వాటిని మిడిల్ ఆర్డర్ భారీ స్కోర్ లుగా చేయలేకపోతుంది.సూర్య కుమార్ , పోల్లర్డ్ , కృనాల్ వీళ్ళందరు వరుసగా విఫలమవుతున్నారు.ఇకపోతే బౌలింగ్ లో బూమ్రా , మలింగ , మార్కండేయ లతో బలంగా ఉంది.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI )

– రోహిత్ శర్మ , డి కాక్ , సూర్య కుమార్ యాదవ్ , యువరాజ్ సింగ్ , కీరాన్ పోలార్డ్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య, మార్కడేయ , లసిత్ మలింగ , మెక్ లారెన్ , బూమ్రా

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది


చెన్నై జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది.బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తున్న బౌలర్లు వారు ఆడిన 3 మ్యాచ్ లలో ప్రత్యర్థి బ్యాటింగ్ ని కట్టడి చేశారు.బ్యాటింగ్ లో రాయుడు మినహా అందరూ బ్యాట్స్ మెన్ ఫామ్ లో ఉన్నారు.ముంబై తో పోరు కనుక ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PROBABLE XI )

: అంబటి రాయుడు , షేన్ వాట్సన్ , బ్రావో , సురేష్ రైనా , ఎం ఎస్ ధోని , కేదార్ జాధవ్ , రవీంద్ర జడేజా , దీపక్ చహార్ , శార్దూల్ థాకూర్ , తహిర్, మిట్చెల్ సన్తంర్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube