ఎన్నికల ముందు కాంగ్రెస్ కి పేస్ బుక్ భారీ దెబ్బ

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాయి.ఇక ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలు సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి.

 Facebook Remove 687 Congress Party Fake Pages-TeluguStop.com

అయితే సోషల్ మీడియా ఎన్నికల ప్రచారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు తమ పార్టీ గురించి ప్రచారం చేసుకోవడం కంటే ప్రత్యర్ధి పార్టీలపై విషప్రచారం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.తప్పుడు వార్తలతో, మార్ఫింగ్ ఫోటోలతో వార్తలని పబ్లిష్ చేయడం.

వాటిని గ్రూప్స్ లో ట్రోల్ చేయడం చేస్తున్నాయి.

ఇంచుమించు సోషల్ మీడియాలో ని పబ్లిసిటీలో వాడుతున్న అన్ని పార్టీలు ఇలాంటి ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.

అయితే సోషల్ మీడియా వెబ్ సైట్ అయిన పేస్ బుక్ ఇలాంటి ప్రచారాలకి అడ్డుకట్ట వేయడానికి కొత్త పాలసీ విధానాలని అందుబాటులోకి తీసుకొచ్చింది.సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని కించపరిచే విధంగా, అలాగే మార్ఫింగ్ ఫోటోలతో తప్పుడు కథనాలు ప్రచారం చేసిన వాటిని వెంటనే తొలగించడం జరుగుతుంది అని తెలియజేసింది.

ఇక ఈ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే పేస్ బుక్ విభాగం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది.ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంతో అనుబంధంగా నడుస్తూ ఉన్న నకిలీ ఖాతాలపై కొరడా ఝుళిపించింది.కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 నకిలీ పేజీలను తొలగించినట్లు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సోమవారం వెల్లడించింది.ఆ ఖాతాలను వారు పోస్ట్‌ చేసిన కంటెంట్‌ ఆధారంగా తొలగించలేదని, తప్పుడు ప్రవర్తన ఆధారంగానే తొలగించామని స్పష్టం చేసింది.

అలాగే పాకిస్తాన్‌ నుంచి నకిలీ అకౌంట్లను నిర్వహిస్తున్న పేజీలను కూడా తొలగించినట్లు వెల్లడించారు.ఇందులో మిలిటరీ ఫ్యాన్‌ పేజీలు, పాక్‌ సంబంధిత వార్తలు, కశ్మీర్‌ కమ్యూనిటీ పేజీలున్నట్లు ఆయన చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube