పిల్లలకి ప్రమాదకరంగా మారిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షాంపూ

మార్కెట్ లోని నిత్యం పదుల సంఖ్యలో చర్మ సౌందర్య ఉత్పత్తులు వస్తూ ఉంటాయి.అయితే వీటిలో చాలా వరకు ప్రమాదకరమైన రాసాయినాలతో చేసినవే ఉంటాయి.

 Samples Of Johnson And Johnson Baby Products Seized-TeluguStop.com

అయితే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిలు, అలాగే పిల్లాల సంరక్షణకి ప్రాదాన్యత ఇచ్చే తల్లిదండ్రులు ఇలాంటివి గమనించారు.దీని కారణంగా శారీరక సమస్యలు తలెత్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో తలెత్తే చాలా శారీరక సమస్యలకి, అలాగే క్యాన్సర్ కి కారణం చర్మ సౌందర్య ఉత్పత్తులు అనే విషయాన్ని వైద్యులు కూడా నిర్ధారించారు.

ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షాంపులో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని రాజస్తాన్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ తాజా సంచలన నిజాలు బయట పెట్టింది.

బేబీ కేరింగ్ కోసం తల్లిదండ్రులు పిల్లలకి ఈ కంపెనీ షాంపులు, ఆయిల్స్ వాడుతూ ఉంటారు.అయితే తాజాగా ఈ సంస్థ తయారు చేస్తున్న పౌడర్‌పై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు బేబీ షాంపూ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైనట్లు తెలుస్తుంది.ఈ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది.

జె అండ్‌ జె బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయనే ఆరోపణలపై కొద్ది నెలల క్రితమే దీని ఉత్పత్తిని నిలిపివేసింది.ప్రభుత్వ పరీక్షల్లో అలాంటిదేమీ లేదని రుజువు కావడంతో ఫిబ్రవరి నెలలోనే మళ్లీ ఈ పౌడర్‌ ఉత్పత్తిని సంస్థ ప్రారంభించింది.తాజాగా మార్చి 5న జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన రెండు బ్యాచ్‌ల నుంచి షాంపూలకు సంబంధించిన శాంపిల్స్‌ను రాజస్థాన్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ పరీక్షించింది.అందులో భవన నిర్మాణాలలో వాడే ఓ రకమైన రసాయినం ఉందని నిర్ధారించింది.

దీంతో రాజస్థాన్ ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube