ప్రేమ పేరుతో 5 ఏళ్ళు సహజీవనం! పెళ్లి అనేసరికి తప్పించుకున్న ప్రియుడు

ఈ మధ్య కాలంలో ప్రేమ పేరు చెప్పి అమ్మాయిల వెంట పడటం.ప్రేమించిన తర్వత ఆమెని లొంగదీసుకొని వాడుకోవడం.

 Women Protest In Lover House For Marriage-TeluguStop.com

ఇక పెళ్లి చేసుకోమని అమ్మాయి అడిగేసరికి అప్పటి నుంచి తప్పించుకోవడం, కాదంటే ఏదో కారణం చెప్పి వదిలించుకునే ప్రయత్నం చేయడం అబ్బాయిలకి ఫాషన్ గా మారిపోయింది.అయితే ఇలాంటి సమయాలలో కొంత మంది అమ్మాయిలు లైట్ గా తీసుకున్న అతనే జీవితం అనుకున్న అమ్మాయిలు మాత్రం అయితే ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే మోసం చేసిన ప్రియుడు నుంచి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం చేస్తూ ఉంటారు.

ఇప్పుడు అలాగే ఓ అమ్మాయి ప్రియుడు చేతిలో మోసపోయి, అతని ఇంటి ముందే న్యాయపోరాటంకి సిద్ధమైంది.వివరాల్లోకి వెళ్తే దేవరకద్రలోని చిన్నచింతకుంట మండల కేంద్రంలో జరిగింది.జుట్ల నర్మద, మక్క మోహన్‌కుమార్‌ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.ఈ క్రమంలో వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్ళారు.

అక్కడ నర్మదా హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేసేది.అలాగే మోహన్ కూడా ఓ కంపెనీలో పని చేస్తూ చదువుకునేవాడు.

అతని చదువు కోసం అమ్మాయి లక్షన్నర వరకు ఆర్ధిక సాయం కూడా చేసింది.ఇక ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసినపుడు తాను మోహన్ ని ప్రేమిస్తున్న అని తల్లిదండ్రులకి కూడా చెప్పేసింది.

ఇదిలా ఉంటే అప్పటి నుంచి మోహన్ తో కలిసి ఉంటున్న నర్మదా అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరడంతో చెల్లి పెళ్లి తర్వాత చేసుకుంటా అని చెప్పి ముందు తప్పించుకు తిరిగాడు.అతని చెల్లి పెళ్లి తర్వాత మళ్ళీ అడిగితే తనని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఇష్టం లేదని నేను చేసుకోలేనని చెప్పి తప్పించుకున్నాడు.దీంతో మోసపోయా అని గ్రహించిన నర్మదా పోలీస్ స్టేషన్ కి వెళ్లి న్యాయం చేయాలని కోరింది.అయితే పోలీసుల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం ప్రియుడు ఇంటి ముందుకి వెళ్లి న్యాయపోరాటంకి సిద్ధమైంది.

గత మూడు రోజులుగా ఆమె అలాగే దీక్ష చేస్తుంది.తనని మోహన్ పెళ్లి చేసుకునేంత వరకు ఇలాగే ఉంటా అని ఆమె మీడియాతో చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube