ఐఐటీ లో ఫెయిల్ అయినా...ఇండియన్ కుర్ర్రాడికి గూగూల్ భారీ ఆఫర్..!!!

ముంబై నగరానికి చెందిన ఓ యువకుడు గూగుల్ లో భారీ వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.దాంతో ఒక్క సారిగా వార్తల్లో నిలిచాడు.

 Indian Student Who Fails In Iit Gets A Big Offer From Google-TeluguStop.com

ఇందులో విశేషం ఏముందు ఇండియా నుంచీ ఎంతో మంది విద్యార్ధులు భారీ వేతనాలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా అని అనుకుంటున్నారా.ఈ విధ్యార్ధిలో స్పెషల్ ఏమిటంటే.

మహారాష్ట్రలోని ముంబయి నగరానికి చెందిన అబ్దుల్లాఖాన్‌ (21) జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్ పరీక్షల్లో ఫెయిలవడంతో ముంబై లో శ్రీ ఎల్‌ఆర్‌ తివారీ ఇంజనీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్సులో బీఈ చదివాడు.కాంపీటేటివ్‌ ప్రోగ్రామింగ్ ఛాలెంజ్ లలో అబ్దుల్లాఖాన్‌ ఫ్రొఫైల్‌ చూసిన గూగుల్‌ సంస్థ పలు ఇంటర్వ్యూ లు నిర్వహించి తుది ఏమ్పికకి లండన్ రమ్మని పిలిచింది.

అయితే ఫైనల్ ఇంటర్వ్యూ కోసం లండన్‌ వెళ్లి సెలెక్ట్ అయిన ఈ ఇండియన్ కుర్రాడికి గూగుల్ ఏడాదికి రూ.54.5 లక్షల వార్షిక మూలవేతనంతో పాటు 15 శాతం బోనస్‌, మరో రూ.58.9 లక్షల స్టాక్‌ ఆప్షన్ల షేర్లను ఇస్తూ గూగుల్‌ ఉద్యోగంలో నియమించింది.గూగుల్‌ సైట్‌ ఇంజినీరింగ్‌ బృందంలో సభ్యుడిగా పనిచేసేందుకు గాను అతడికి అవకాశం ఇచ్చింది.అంటే అతడికి మొత్తంగా రూ.1.2 కోట్ల వార్షికవేతనం వస్తుందన్న మాట.జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్ పరీక్షల్లో ఫెయిల్ అయినా సరే తనకి ఉన్న టాలెంట్ ద్వారా అతడు గూగుల్ ని మెప్పించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube