ఆ హాలీవుడ్ చిత్ర స్ఫూర్తితోనే ఆర్ఆర్ఆర్! రాజమౌళి మరోసారి అదే పంథాలో

నందమూరి హీరో తారక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టిన రాజమౌళి దీనిని అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రల స్ఫూర్తితో తయారుచేసుకున్న ఫిక్షన్ స్టోరీ అని స్పష్టం చేశారు.

 Director Rajamouli Making Rrr Movie In Hollywood Style-TeluguStop.com

ఇక ఈ సినిమాలో లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నాడు.ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో నార్త్ ఇండియాలో లో భారీ షెడ్యూల్ కి రెడీ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఇప్పుడు దర్శక దిగ్గజం రాజమౌళి హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాడు అనే వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది.విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాకి మోటార్ సైకిల్ డైరీ అనే సినిమా స్ఫూర్తి అని తెలుస్తుంది.ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన చాలా చిత్రాలు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే.రాజమౌళి సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా అందులో చాలావరకు సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేసిన అనే అభిప్రాయం ఉంది.

ఇప్పుడు ఈ సినిమా కూడా అదే పంథాలో రాజమౌళి తెరకెక్కించిన గమనార్హం.ఇప్పటికే బాహుబలి తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజమౌళి ఈ సినిమాతో మరి ఏ స్థాయిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube