మహేష్ తో చేయబోయే సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన అని రావిపూడి.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రస్తుతం మహేష్ బాబు దిల్ రాజు నిర్మాణం లో మహర్షి సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు , ఈ సినిమా దాదాపు ఫైనల్ షెడ్యూల్ కి వచ్చేసింది.ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ సినిమా జరగాల్సింది , కానీ కొన్ని కారణాల వల్ల అది కాస్తా సుకుమార్ అల్లు అర్జున్ సినిమా గా మారింది.

 Anil Ravipudi Gets Huge Remuneration For Mahesh Babu Movie-TeluguStop.com

ఇటువంటి పరిస్తితులలోనే మహేష్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారో అని అందరూ అనుకున్నారు , కానీ దిల్ రాజు మహేష్ తో మరో సినిమా చేయబోతున్నాం అని ప్రకటించాడు , దానిని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు అని చెప్పారు.

అనిల్ రావిపూడి చేసిన వి నాలుగు సినిమాలే ఏ హీరో తో సినిమా తీసిన ఆ హీరో కెరీర్ లొనే భారీ విజయాన్ని అందించిన ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ .అనిల్ తను దర్శకత్వం చేసిన గత నాలుగు చిత్రాలు పటాస్ , సుప్రీమ్ , రాజా ద గ్రేట్ , f2 అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు సాధించాయి , ఇందులో 3 సినిమాలు దిల్ రాజు నిర్మాణం లొనే వచ్చాయి.

అయితే ఇటీవలే మహర్షి సెట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ కి స్టోరీ లైన్ చెప్పాడట అది మహేష్ కి ఎంతో నచ్చి సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే దిల్ రాజు కి అనిల్ రావిపూడి కి మంచి సాన్నిహిత్యం ఉండడం తో ఈ సినిమాని కూడా తన బ్యానర్ లొనే చేద్దాం అని దిల్ రాజు అనడం దానికి అనిల్ ఒప్పుకున్నారని టాక్ , అయితే మహేష్ తో సినిమా కావడం దానికి తోడు అనిల్ రావిపూడి కి వరస విజయాలు ఉండడం తో అనిల్ ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం.

గత సినిమా f2 కోసం 3కోట్లు తీసుకున్న అనిల్ రావిపూడి , మహేష్ సినిమా కోసం 5 కోట్లు అడిగారట .దిల్ రాజు దానికి ఒప్పుకోక తప్పలేదు , అనిల్ లాంటి డైరెక్టర్ స్టార్ హీరో తో ఎలా డీల్ చేస్తారన్నదే అందరూ మాట్లాడుకుంటున్న విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube