అందరి మీద పోరాటం అంటే ఎలా బాబు ?

తనకు అనుకూలంగా ఏమి జరగకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు కి కోపం తీవ్ర స్థాయిలో వచ్చేస్తుంది.తనకు అనుకూలంగా అన్ని పనులు జరుగుతున్నప్పుడు వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని, లేకపోతే వ్యవస్తహలన్నీ నిర్వీర్యం అయిపోయాయని బాబు భావిస్తుంటారు అనే టాక్ ఏపీలో ఉంది.

 How It Is Possible To Fight Against Everyone Chandrababu-TeluguStop.com

గతంలో బీజేపీ ప్రభుత్వం తో స్నేహం కొనసాగించిన బాబు అప్పుడు ప్రత్యేక హోదా విషయం లో బీజేపీ ఎన్ని డ్రామాలు ఆడినా నోరు మెదపలేదు.ప్రత్యేక హోదా ఏపీకి కావాల్సిందే అని పట్టుబట్టలేదు సరికదా, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అంటూ ప్రశ్నించాడు.

కట్ చేస్తే బీజేపీ టీడీపీ స్నేహం చెదిరిపోయిన తరువాత బాబు కి అకస్మాత్తుగా స్పెషల్ స్టేటస్ అంశం గురుహుకు వచ్చింది.ఇంకేముంది బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది అంటూ కొత్త రాగం అందుకున్నారు.

ఇక ఇప్పుడు చూస్తే ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడం బాబు కి కోపం తెప్పించింది.టీడీపీ కి అనుకూలంగా ప్రవర్తిస్తారు అనే అపవాదు మూటగట్టుకున్న ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తో పాటు శ్రీకాకుళం ఎస్పీ, కడప ఎస్పీలను ఎన్నికల సంగం బదిలీ చేయడం బాబు కి నచ్చలేదు.

అందుకే ఇప్పడు చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ మీద యుద్ధం ప్రకటించారు.ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పై వైసీపీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయడం, ఎన్నికల కమిషన్‌ స్పందించి ఐబీ చీఫ్‌ వెంకటేశ్వరరావుని బదిలీ చేసింది.

అందుకే బాబు కి కోపం వచ్చి జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్‌పై పోరాటం చేస్తామంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చేశారు.

సాధారణంగా పొలిటికల్ పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం విచారణ చేయడం, అధికారులను బదిలీ చేయడం సర్వ సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి.వాస్తవానికి అంతకు ముందే వైఎస్సార్సీపీ, ఏపీ డీజీపీ మీద కూడా ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది.అలాగని ఆయన్ని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించలేదు కదా ? ఈ విషయాన్ని బాబు మర్చిపోతున్నాడు.షరామామూలుగా వైసీపీ, టీఆర్ఎస్ , బీజేపీ కుమ్మక్కయ్యి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి అంటూ పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతున్నాడు.ఏపీలో ఈడీ, ఐటీ శాఖ, సీబీఐ తదితర సంస్థలు తమ అనుమతి లేకుండా ఇక్కడ అడుగుపెట్టడానికి వీల్లేదు అంటూ మొండిపట్టు పట్టడం , ఆ సంస్థల మీద పోరాటం చేయడం బాబు కే చెల్లింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube