విదేశాల్లో ఉండే రెస్టారెంట్ లలో అక్కడ తినడానికి వచ్చిన జనాలకు వెయిటర్ లు ఫుడ్ సర్వ్ చేయడమో లేదా వారికి కావలిసిన వంటకామే , డ్రింకో తెచ్చి సర్వ్ చేస్తే వారికి నచ్చిన మొత్తం లో బహుమానంగా టిప్ ఇస్తారు.మన దేశంలో కూడా 50 , 100 ఓ మహా అయితే 500 రూపాయలో టిప్ గా ఇస్తాం .
కానీ యుఎస్ లోని నార్త్ కరోలినా అనే స్టేట్ లోని ఒక రెస్టారెంట్ లో ఒక గ్లాస్ వాటర్ తెచ్చినందుకే 7 లక్షల రూపాయలు టిప్ గా ఇచ్చాడు , అసలు కథేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
అమెరికా లో ఒక యువతికి తన సంవత్సర మొత్తం కాలం లో సంపాదించిన రాని డబ్బు ఒక నిమిషంలో నే సంపాదించింది.
అమెరికాలోని అలైనా అనే యువతి ఒక యూనివర్సిటీలో చదవుకుంటూ తన ట్యూషన్ ఫీజులకై ‘సూప్ డాగ్స్’ అనే రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది.ఒక రోజు ఎప్పటిలాగే తన క్లాస్ అయిపోగానే రెస్టారెంట్ కు వచ్చి కస్టమర్స్ కు సర్వ్ చేస్తూ పనిలో మునిగిపోయింది.
రోజూ ఆ హోటల్ కు వచ్చిన ఎంతోమంది కస్టమర్స్ ఆమెకు టిప్పుగా వందో.రెండొందలో ఇస్తూ ఉండేవాళ్లు వాటితో తన కి అవసరమైన వాటికోసం ఖర్చు చేస్తుండేది.అయితే ఎప్పటిలాగే ఒకరోజు ఆ హోటల్ కు ఒకతను వచ్చి వాటర్ ఆర్డర్ చేసాడు.ఆ యువతి వెంటనే వెళ్లి ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని ఆ టేబుల్ కు సర్వ్ చేసింది.
అతను ఆ వాటర్ తాగి అక్కడి నుంచి వెళ్తూ ఒక డబ్బుల కట్టను, ఒక లెటర్ ను ఉంచాడు.
కొద్దిసేపటికి ఆ యువతి టేబుల్ క్లీన్ చేయడానికి వచ్చి ఆ టేబుల్ వైపు చూడగా అక్కడ లెటర్ తో పాటు డబ్బుల కట్ట ఉండడం చూసి షాక్ అయింది.ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ‘నేను దాహంతో ఉన్నప్పుడు మంచి రుచికరమైన వాటర్ తెచ్చిచ్చినందుకు థాంక్స్’ అంటూ రాసి ఉంది.ఆ డబ్బుకట్టను లెక్కబెట్టగా 10 వేల డాలర్లు ఉన్నాయి.
అంటే మన ఇండియన్ కరెన్సీ లో దాదాపు 7 లక్షల రూపాయలు.దీంతో అలైనా మరింత ఆశ్చర్యానికి గురై అతనికోసం చూస్తుండగా అతనే మళ్ళీ రెస్టారెంట్ కు వచ్చి తనకి ఒక హగ్ ఇచ్చి విష్ చేసి నవ్వుతు వెళ్లిపోయాడు.
అతను ఎవరో కాదు యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్‌గా గుర్తింపు పొందిన జిమ్మీ డొనాల్డ్‌సన్.తరువాత తనకి టిప్ రూపంలో వచ్చిన 10 వేళా డాలర్లను మొత్తం తీసుకోవడం ఇష్టం లేక అందులో కొంత భాగాన్ని తనతో పనిచేతున్న ఇతర సిబ్బందికి పంచిపెట్టింది…
.