2019 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉన్న జట్లు ఏంటో తెలుసా ? కోహ్లీ కెప్టెన్సీ లో భారత్ గెలుస్తుందా?

క్రికెట్ వరల్డ్ కప్ కి సమయం దగ్గర పడింది , ఇంగ్లాండ్ లో జరగాల్సిన ప్రపంచ కప్ కోసం ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ సంసిద్ధం అయినట్లే ,అన్ని జట్లు దాదాపు తమ తమ జట్ల చివరి వన్డే మ్యాచ్ లు ఆడేసింది .ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి సొంత గడ్డపైన ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టే బాగా బలంగా కనిపిస్తుంది కానీ ఇంగ్లాండ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవకపోవడం వారి పైన కొంచం ఒత్తిడి ఎక్కువే ఉంటుంది అయితే ఏ ఏ జట్లకి ఎంత శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి చూద్దాం

 Who Will Win The 2019 Cricket World Cup-TeluguStop.com

1.

ఆస్ట్రేలియా ( 5 సార్లు ప్రపంచ కప్ విజేత )


క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వరల్డ్ కప్ లు గెలిచిన మాజీ ఛాంపియన్ కంగారు జట్టు వరల్డ్ కప్ ముందు భారత్ ను సొంత గడ్డ పై ఓడించడం వారిని వరల్డ్ కప్ రేస్ లోకి తెచ్చింది.గతేడాది స్మిత్ , వార్నర్ బ్యాన్ తరువాత కంగారు జట్టు ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు భారత్ లో గెలిచిన వన్డే సిరీస్ తప్ప.

అయితే వార్నర్ , స్మిత్ నిషేధ గడువు ముగియడం కంగారు జట్టు ఫామ్ కి రావడం రెండు ఆసీస్ కి కలిసొచ్చే విషయం , పైగా ఇంగ్లాండ్ లో ఆ జట్టు ఎక్కువ సిరీస్ లు అది ఉండడం .మాక్స్ వెల్ , స్టయినిస్ వంటి హిట్టేర్ లు స్టార్క్ , రిచర్డ్సన్ వంటి బౌలర్లు వరల్డ్ కప్ లో ప్రభావం చూపితే ఆసీస్ 6 వ సారి విజేతగా నిలిచే అవకాశం ఉంది.ఎక్కువ అనుభవం లేని జట్టు కావడం కంగారులకు కలవరపెట్టే విషయం.

ఆస్ట్రేలియా గెలిచే అవకాశం – 15 %

2.పాకిస్తాన్ ( ఒకసారి ప్రపంచ కప్ విజేత )


పాకిస్తాన్ ఎప్పుడు ఎలా అడుతుందో ఎవరు అంచనా వేయలేరు , ఎటువంటి అంచనాలు లేకుండా ప్రపంచ కప్ కి రావడం పాక్ కి కలిసి వచ్చే అవకాశం , ఇంగ్లాండ్ లో వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ,అక్కడ పిచ్ లు పాక్ బౌలర్లకు అనుకూలించడం పాక్ కి ప్లస్ పాయింట్ లు.పాకిస్తాన్ బ్యాటీంగ్ నిలకడ లేక ఇబ్బంది పడుతుంది.ఒకవేళ బ్యాట్స్ మెన్ ఫామ్ కి వస్తే పాకిస్తాన్ గెలిచే అవకాశం ఉంది.


పాకిస్తాన్ గెలిచే అవకాశం – 10 %

3.దక్షిణ ఆఫ్రికా ( 4 సార్లు సెమీ ఫైనల్ )


దక్షిణ ఆఫ్రికా వరల్డ్ కప్ వచ్చే సరికి ఆ జట్టుకు ఏదో రూపం లో సమస్య వస్తుంది , ఎంత మంచి గా టీం ఉన్న ఎక్కడో ఒక పొరపాటు వలనో , అవతల జట్టు లో అనుకోని ఆటగాళ్ల ప్రదర్శన వలనో ఆ జట్టు ఇప్పటి దాకా ఫైనల్ చేరలేదు , ఈ సారి అనుభవం ఉన్న డివిలియర్స్ లేకపోవడం ఆ జట్టు కి పెద్ద లోటు .బౌలింగ్ బానే ఉన్న జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు ఉండడం ఆ జట్టుని ఇబ్బంది పెడుతుంది.

దక్షిణ ఆఫ్రికా గెలిచే అవకాశం – 10 %

4.శ్రీలంక – ( ఒకసారి ప్రపంచ కప్ విజేత )

ఒక్కపుడు దాదాపు ప్రతి ప్రపంచ కప్ లో సెమీఫైనలో ఫైనలో వెళ్లే శ్రీలంక జట్టు జయవర్ధనే , సంగక్కర , దిల్షాన్ వీడ్కోలు తరువాత ఆ జట్టు పసికూన ల తయారయింది.ఈ సారి ప్రపంచ కప్ లో శ్రీలంక ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

శ్రీలంక గెలిచే అవకాశం – 2%

5.వెస్టిండీస్ – ( 2 సార్లు ప్రపంచ కప్ విజేత )


వెస్టిండీస్ 1975 ,79 ల్లో వరుసగా రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన బలమైన జట్టు , క్రమేపి ఆ జట్టు లో ఆటగాళ్లు వన్డే ల పైన దృష్టి పెట్టకపోవడం , ఎక్కువగా టీ20 లీగ్ లకి పరిమితమవడం ఆ జట్టుని పసికూన చేసింది.టీ20ల్లో మంచి ప్రదర్శన చేస్తూ రెండు సార్లు టీ20 కప్ ని గెలిచిన విండీస్ వన్డే ప్రపంచ కప్ గెలవడం మాత్రం అసాధ్యంగానే కనిపిస్తుంది.గేల్ చివరి ప్రపంచ కప్ కాబట్టి విండీస్ ఆశలన్నీ క్రిస్ గేల్ పైనే ఆధారపడి ఉన్నాయి.

విండీస్ గెలిచే అవకాశం – 3%

6.బంగ్లాదేశ్ – ( క్వార్టర్ ఫైనల్ )


బంగ్లాదేశ్ జట్టు ఏ అంచనాలు లేకుండా ప్రపంచ కప్ కి వస్తుంది , ఆ జట్టు ఎక్కువగా సొంత గడ్డపైన కాకుండా బయట మ్యాచ్ లు గెలవడానికి చాలా కష్టపడుతుంది.ఈ సారి జట్టు బలంగానే ఉన్న ఒకటి రెండు అద్భుతాలు తప్ప ఆ జట్టు ఎం చేయలేదు , ఒకవేళ సెమీస్ వరకు వస్తే బంగ్లాదేశ్ కి మంచి విజయం.

బంగ్లాదేశ్ గెలిచే అవకాశం – 2%

7.ఇంగ్లాండ్ ( ప్రపంచ కప్ ఫైనల్ )


ఈ సారి ప్రపంచ కప్ లో అందరి కన్ను ఇంగ్లాండ్ జట్టు పైనే ఉంది సొంత గడ్డ పైన ఆడుతూ ఉండడం అతగాళ్లందరు ఫామ్ లో ఉండడం జట్టు లో ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉండడం ఆ జట్టు కప్ గెలుస్తుంది అన్న అంచనాలు ఎక్కువ చేస్తుంది.ఈ సారి ఆ జట్టుకు కొంచం లక్ కలిసొస్తే 2019 ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ అనడం లో సందేహం లేదు.

ఇంగ్లాండ్ గెలిచే అవకాశం – 35 %

8.ఇండియా ( 2 సార్లు ప్రపంచ కప్ విజేత )


ఇప్పుడున్న జట్లలో ఇంగ్లాండ్ ని మినహాయిస్తే భారత్ జట్టే చాలా బలంగా ఉంది , కానీ టీం కి నెంబర్ 4 స్థానం , 5 వ బౌలర్ భర్తీ తికమక పెడుతుంది , ఓపెనర్లు ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు , జట్టు బ్యాటింగ్ అంత టాప్ ఆర్డర్ పైనే ఆధారపడి ఉండడం జట్టుని భయపెడుతోంది.ఒకవేళ ఇండియన్ ఆటగాళ్లందరు సమిష్టిగా రాణిస్తే భారత్ 3 వ సారి లార్డ్స్ లో ప్రపంచ కప్ ని ముద్దాడుతుంది.

భారత్ గెలిచే అవకాశం – 23 %


9.ఆఫ్గనిస్తాన్ ( ప్రపంచ కప్ అర్హత సాధించడం )


అఫ్గాన్ జట్టు పటిష్టంగానే ఉన్న మెగా ఈవెంట్స్ లో అనుభవం లేకపోవడం పెద్ద లోటు.ఆ జట్టు ఈ సారి ప్రపంచ కప్ లో కొన్ని జట్లకి షాక్ ఇవ్వబోతోంది అనడం లో సందేహం లేదు.క్వార్టర్ ఫైనల్ కి వస్తే అఫ్గాన్ జట్టుకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఏది ఏమైనా ఇప్పటికి క్రికెట్ పండితులు ప్రపంచ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ కి భారత్ కి మధ్య జరగబోతుంది అంటూ జోతిష్యం చెప్పేస్తున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube