గీతా ఆర్ట్స్ ని మెప్పించిన నువ్వు తోపురా

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉందిలే మంచి కాలం ముందుముందునా అనే సినిమాతో మెప్పించిన నటుడు సుధాకర్ కొమాకుల.మొదటి సినిమాతో నాగరాజు పేరుతో టాలీవుడ్ లో పాపులర్ అయిన సుధాకర్ తాజాగా నువ్వు తోపురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

 Geetha Arts Distributing Nuvvu Thopu Raa Movie-TeluguStop.com

అమెరికాలో షూటింగ్ జరుపుకున్న నువ్వు తోపురా మూవీ సినిమాని ఎన్ఆర్ఐ లపై అమెరికాలో జరుగుతున్నా దాడులని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే హరనాథ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏప్రిల్ 26న రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేయడానికి ముందుకి రావడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.టాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న గీతా ఆర్ట్స్ ఇప్పటి వరకు సినిమాల డిస్ట్రిబ్యూషన్ మీద పెద్దగా ద్రుష్టి పెట్టలేదు.

అయితే ఊహించని విధంగా ఇప్పుడు నువ్వు తోపురా సినిమా రెండు రాష్ట్రాలలో రిలీజ్ చేయడానికి గీతా ఆర్ట్స్ సిద్ధం అయ్యింది.దీంతో ఈ సినిమాకి ఇప్పుడు ఊహించని విధంగా హైప్ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube