అమెరికా యూనివర్సిటీలలో బయటపడ్డ భారీ కుంభకోణం..!!!

ప్రపంచంలోనే ప్రఖ్యాత యూనివర్సిటీలుగా పేరొందిన యేల్‌, స్టాన్‌ఫర్డ్‌, జార్ట్‌టౌన్‌,యూనివర్సిటీ ఆప్‌ సదరన్‌ కాలిఫోర్నియా లాంటి యూనివర్సిటీలలో విద్యార్ధులు చదువుతున్నారు అంటే వారికి భారీ డిమాండ్ ఉంటుంది.అయితే అటువంటి యూనివర్సిటీలలో చదవాలంటే తప్పకుండా ఎంట్రన్స్ పరీక్షలలో పాస్ అవ్వాలి, ఆ తరువాత ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలి అప్పుడు కాని ఆ యూనివర్సిటీలలో సీట్లు రావు.

 Hollywood Stars Scam For Big University-TeluguStop.com

కాని కొందరు హాలివుడ్ స్టార్స్ మాత్రం తమ పిల్లల కోసం వారిని ఆయా వర్సిటీలలో చేర్చడం కోసం అడ్డదారులు తొక్కారు.రూ.కోట్లలో లంచాలు ఎరగా చూపి సీట్లు సాధించుకున్నారు.ఈ స్కాంలో డిస్పరేట్‌ హౌజ్‌వైఫ్‌ నటి ఫిలిసిటీ హఫ్‌మన్‌, లోరి లాగ్లిన్‌, సహా 50 మందపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

అయితే ఈ వ్యవహారం నడిపిన నిందితుల్లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు, పైనాన్షియర్లు, ఓ వైన్‌ తయారీదారు, ఫ్యాషన్‌ డిజైనర్‌ ఉన్నారు.అంతేకాదు కాలిఫోర్నియా కి చెందిన ఓ వ్యక్తి ఓ బోగస్ చారిటీ సంస్థని నెలకొల్పి వీరివద్ద డబ్బులు సేకరించి సీట్లు ఇప్పించినట్టుగా తెలుస్తోంది.అంగవైకల్య విద్యార్ధులకి ఇవ్వాల్సిన కోటాలో వీరు సీట్లు సంపాదించినట్టు తెలుస్తోందని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube