ఒక్క రోజు కోమాలోకి వెళ్లింది... లేచేప్పటికి 7 నెలల గర్బం చూసుకుని నోరెళ్లబెట్టింది

ఇంగ్లాండ్‌లో అత్యంత అరుదైన వింతైన సంఘటన జరిగింది.ఈ సంఘటన చెప్పినా నమ్మడం కష్టంగా ఉంది.కాని నమ్మినా నమ్మకున్నా ఇది నిజం.18 ఏళ్ల ఏబోనీ అనే బాలిక ఫిజియోథెరఫీ చదువుతోంది.ఏబోనీకి హఠాత్తుగా తలనొప్పి వచ్చింది.ఆ తలనొప్పి భరించలేక పోవడంతో తన బెడ్‌ రూంకు వెళ్లి పడుకుంది.ఆమె ఆ నొప్పితో కోమాలోకి వెళ్లి పోయింది.కేవలం ఒక్క రోజులోనే తిరిగి మామూలు మనిషి అవ్వగలిగింది.

 Girl Slips Into Coma Wakes Up Pregnant With 7lb Baby In Second Womb-TeluguStop.com

అయితే మామూలు మనిషి అయిన ఆమెకు నోరెళ్లబెట్టే విషయం ఒకటి తెలిసింది.

బెడ్‌ రూంలో పడుకున్న ఏబోనీ ఎంతకు లేవకపోవడంతో పాటు, ఆపస్మారక స్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.

హాస్పిటల్‌లో వైధ్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు.పలు పరీక్షలు చేసిన తర్వాత ఆమె గర్బం దాల్చినట్లుగా చెప్పారు.ఐసీయూలో మెరుగైన చికిత్స అందడంతో 24 గంటల తర్వాత ఏబోనీ కళ్లు తెచిరించింది.బెడ్‌ రూంలో పడుకున్న నేను ఇక్కడకు ఎలా వచ్చాను అంటూ ఆమె గందరగోళంకు గురైంది.

ఆ సమయంలోనే తన కడుపు చూసుకుంటే లావుగా అనిపించింది.వైధ్యులు ఏడు నెలల గర్బం అంటూ చెప్పడంతో అవాక్కయింది.

తనకు ప్రతి నెల పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తున్నాయి.గర్బవతిని ఎలా అవుతాను అంటూ ఏబోనీ వైధ్యులను ప్రశ్నించింది.అప్పుడే వైధ్యులు ఆమెకు ఉన్న అరుదైన జబ్బు గురించి వివరించారు.ఆ జబ్బు వల్ల ఆమెకు రెండు గర్బసంచులు ఉన్నాయి.ఒక గర్బసంచిలో పిండం పెరుగుతూ ఉండగా మరో గర్బంసంచి వల్ల ప్రతి నెల నెలసరి వస్తుంది.అలాగే పిండం పెరుగుతున్న గర్బసంచి వెనుక వైపు ఉన్న కారణంగా కడుపు పెద్దగా అనిపించలేదని వైధ్యులు చెప్పారు.

ఏడు నెలల సమయంలో ఏబోనీకి తాను గర్బవతిని అని తెలిసింది.ఇటీవలే ఆమె పండంటి పాపాయికి జన్మనిచ్చిందట.18 ఏళ్ల వయసుకే తాను తల్లిని అయినందుకు ఏబోనీ సంతోష పడుతోంది.ఇక్కడ కొసమెరుపు ఏంటీ అంటే ఏబోనీకి పెళ్లి కాలేదు, ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ద్వారా గర్బవతి అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube