ఏంటేంటి .... బాబు కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇలా అందిందా ...?

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చి వైసీపీని బలహీనం చేసి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.అయితే ప్రస్తుతం ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో వైసీపీ బలహీనపడకపోగా మరింత బలపడినట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ అందించడంతో టీడీపీ లో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.

 Chandrababu Naidu About Intelligence Report-TeluguStop.com

ఇప్పటి వరకు వైసిపి నుంచి టిడిపి కి చేరికలు కనిపించాయి.అయితే ప్రస్తుత తరుణంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు టిడిపి ని వీడి వైసీపీలో చేరేందుకు క్యూ కట్టడం ఇప్పుడు టీడీపీకి మింగుడుపడడంలేదు.

ప్రస్తుతం అధికార పార్టీ టిడిపి నుంచి వలస వచ్చే వారే తప్ప ఆ పార్టీలోకి వలస వెళ్లేవారు కనిపించడం లేదు .

దీనికి ప్రధాన కారణం అనేక జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలు టీడీపీకి అనుకూలంగా పరిస్థితులు లేనట్టు రిపోర్ట్స్ వెల్లడించాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని అనేక సర్వే సంస్థలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతుండడంతో టీడీపీ సిట్టింగ్ లో చాలామంది వైసీపీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది.దీనికి తోడు ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ కూడా … నాయకులను కంగారు పెట్టిస్తున్నాయి.

తాజాగా టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు… 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటం దాదాపు ఫిక్స్ అయిపోయిందని… ఎవరెవరు పార్టీని వీడబోతున్నారో తెలియజేస్తూ… రిపోర్టును చంద్రబాబుకు అందించడంతో బాబు షాక్ అయ్యాడట.

ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లినా… స్థానిక నాయకుల అవినీతి మితిమీరిన జోక్యం కారణంగా మెజార్టీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తమ సర్వే లో తేలినట్టు ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందించింది.ప్రస్తుతం టీడీపీని వేడి ఎమ్మెల్యేలు, ఎంపిల జాబితాను చుసిన బాబు వారిని బుజ్జగించేందుకు అన్నిరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు.అయితే ఎవరెన్ని చెప్పినా పార్టీ మారాలన్న నాయకులు మాత్రం ససేమేరా అంటున్నారట.

ఎన్నికల ముందు ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube