అరుదైన సర్టిఫికెట్‌ పొందిన స్నేహ.. ఇండియాలో అంతా ఇలా ఆలోచిస్తే ఎప్పుడో అమెరికాను దాటేసేవాళ్లం

ఇండియాలో ఎక్కడ చూసినా కులాలు, మతాలు అంటూ తారతమ్యాలు ఉంటాయి.ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇండియాలో మాత్రమే జనాలు మతాలు, కులాలు అంటూ గీతలు గీసుకుని మరీ బతికేస్తున్నారు.

 Different Certificates Got Indian Lady Sneha Mumtaj Jennifer-TeluguStop.com

ఇలాంటి పరిస్థితులు ఇండియా నుండి పోగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నా కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఆ అంతరాలు ఇంకా పెంచేందుకు కులాల ప్రాతిపాధికన రిజర్వేషన్లు ఇవ్వడం, మతాల వారికి ప్రత్యేక పథకాలు పెట్టడం చేస్తున్నారు.మతం సంగతి ఏమో కాని కులాలు దేశ అభివృద్దిని పాతాలానికి తొక్కేస్తున్నాయంటూ నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలోని ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఉంటే దేశం ఎప్పుడో బాగు పడేది.కాని ఇప్పటికి కూడా మన దేశం అభివృద్ది చెందుతున్న దేశంగానే చెబుతున్నారు.

రెండు మూడు దశాబ్దాలుగా మన దేశం అభివృద్ది చెందుతున్న దేశంగానే పిలవబడుతోంది.ఇంకా ఎప్పటికి అభివృద్ది చెందాదా అంటూ జనాలు భావిస్తున్నారు.

అయితే అదే జనాలు మతాలు, కులాలు అంటూ గీతలు గీసుకుని బతికేస్తు వారే దేశ అభివృద్దిని అడ్డుకుంటున్నామనే విషయాన్ని విష్మరిస్తున్నారు.

ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మతం, ఏదో ఒక కులంకు చెందిన వారు ఉంటారు.కాని స్నేహ ముంతాజ్‌ జెన్నిఫర్‌ మాత్రం ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు, ఏ కులానికి చెందిన వ్యక్తి కాదు.ఈ విషయం ఆమె సొంతంగా చెప్పుకోవడం లేదు.

ఆమెకు ప్రభుత్వం నుండి సర్టిఫికెట్‌ వచ్చింది.ఆమె తన కులాన్ని మరియు మతాన్ని త్వజించింది.

దాంతో ఆమెకు కులం మతంతో సంబంధం లేదు అంటూ స్వయంగా ఉన్నతాధికారులు ఒక దృవీకరణ పత్రాన్ని ఇచ్చారు.

ఈ పత్రంను పొందేందుకు ఆమె పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.ఆమె తండ్రి మొదట నుండి కూడా ఇలాంటి పత్రాన్ని పొందేందుకు ప్రయత్నించాడు.కాని అప్పటి వరకు వచ్చిన అధికారులు మరియు ఇతర విషయాల కారణంగా ఆయనకు ఆ సర్టిఫికెట్‌ దక్కలేదు.

లాయర్‌ ఫ్యామిలీ నుండి వచ్చిన స్నేహ మాత్రం తన తండ్రి పొందలేని సర్టిఫికెట్‌ను తాను పొందాలని భావించింది.అందుకోసం చాలా కష్టపడింది.అనుకున్నట్లుగానే ఆమె ప్రయత్నం ఫలించింది.

ఆమె ఈ సర్టిఫికెట్‌ పొందడానికి ఆమె భర్త చాలా హెల్ప్‌ చేశాడు.

ఆమె చేసిన ప్రతి ప్రయత్నానికి అండగా నిలిచాడు.చివరకు ఆమె కోరుకున్నట్లుగానే సర్టిఫికేట్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube